ఆదివారం 29 మార్చి 2020
Jagityal - Feb 11, 2020 , 01:23:43

బ్రహ్మోత్సవాలకు ముస్తాబు

బ్రహ్మోత్సవాలకు ముస్తాబు

ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి ఆలయాన్ని బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి వేడుకల సందర్భంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నా రు. ఈ నెల 18వ తేదీ నుంచి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేపట్టనున్నారు. ఆలయంలో అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 21వ తేదీన మహాశి వరాత్రి ఉత్సవాలు నిర్వహించనుండగా,  ప్రతి ఏడాది ఇక్కడ నాలుగు రోజుల ముందు నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 18వ తేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 19న భ్రమరాంభ మల్లికార్జునస్వామి వార్ల కల్యాణంతో పాటు గ్రామ పర్యటన తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ ఉత్సవాలను  వైభవంగా చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవతామూర్తుల విగ్రహాలు, ఆలయం చుట్టూ రంగులు, సున్నాలు వేస్తున్నారు. ఉత్సవాలకు కావాల్సిన మిగతా ఏర్పాట్లలో ఈఓ రాజేంద్రం, సిబ్బంది నిమగ్నమయ్యారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు  ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు అధికంగా ఈ ఉత్సవాలకు తరలిరానున్నడంతో అందుకు అనుగుణంగా తగిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగే బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ విరాళదాతలను ఆహ్వానించేందుకు పత్రికలను ఆలయ సిబ్బంది సిద్ధం చేస్తున్నారు.  


logo