సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Feb 11, 2020 , 01:19:45

ఘనంగా పార్వేట్‌ ఉత్సవం

ఘనంగా పార్వేట్‌ ఉత్సవం

సారంగాపూర్‌ : బీర్‌పూర్‌ మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి ఆల యంలో నిర్వహిస్తున్న  బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అటవీ ప్రాంతం లో పార్వేట్‌ ఉత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. గ్రామ శివారులో గల దట్ట మైన అడవుల్లో లక్ష్మీ నరసింహ స్వామి గుర్రంపై స్వారీ చేస్తూ ఆలయం నుంచి  సుమారు 2కిలో మీటర్ల దూరంలో ఉన్న గుట్టల వద్ద పులిని వేలాడి సంహరించే మహా సన్నివేశాన్ని  నిర్వహించారు. బీర్‌ పూర్‌ లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్ర హ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కల్యాణం తర్వాత నిర్వహించే పార్వేట్‌ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వారు చిన్నగుట్టపై వెలవక ముం దు పెద్ద గుట్టవద్ద జాతర జరుగుతున్న సమయంలో భక్తురాలు ఇంతపెద్ద  గు ట్టపై వెలిసావు. నేనొక్కదానిని వస్తేనే ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను వేలా దిగా వచ్చే భక్తుల సంగతేమిటని స్వామి వారిని అడగగా, నేను ఇక్కడి నుంచి గుర్రంపై వెళ్తాను. ఎక్కడైతే ఆగుతానో అక్కడ వెలుస్తానని చెప్పి గుర్రంపై వేటకు వెళ్తుండగా, అరణ్యంలో గుట్ట వద్ద గుర్రం కాలు జారి బెనకడంతో తన గమ్యం ఇక్కడి వరకే అనుకొని వెనక్కి తిరిగి దగ్గరలోని ఉన్న చిన్న గుట్టపై లక్ష్మీ నర్సింహ స్వామిగా వెలిసినట్లు చరిత్ర ఆనవాళ్లు చెప్తున్నాయి. స్వామి వారి గుర్రపు కాళ్ల అచ్చులు ఉన్న ప్రాంతానికి స్వామి వారిని మేళతాళాలతో పల్లకీలో తీసుకెళ్లి పులిని సంహరించే మహా ఘ ట్టాన్ని వేద పండితులు ఘనంగా నిర్వ హించారు. గుర్రపు డెక్క, కాలు అచ్చు లున్న ప్రాంతంలో వేద పండితులు ప్రత్యే క పూజలు చేశారు. అలాగే చెంచులక్ష్మిని స్వామివారికి ఇచ్చి వివాహం చేసే కా ర్యక్రమాన్ని నిర్వహించి చరిత్రను భ క్తులకు వివరించారు. ఆయా ప్రాంతాల నుంచి ఉత్సవాలను తిలకించేందుకు వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించు కొని ప్రత్యేక పూజలు చేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేశ్‌, గ్రామ సర్పంచ్‌ గర్షకుర్తి శిల్ప, ఆలయ కార్యనిర్వహణ అధికారి ముద్దం శ్రీనివా స్‌, మాజీ ఆలయ చైర్మన్లు బైరవేని ఆంజ నేయులు, గొడుగు కేశవులు, ఎస్‌ఐ మ నోహర్‌ రావు, వేద పండితులు ఒద్దిపర్తి రామాచార్యులు, ఒద్దిపర్తి సంతోష్‌ కుమా ర్‌, ఒద్దిపర్తి చిన్న సంతోష్‌ కుమార్‌, ఒద్ది పర్తి మధుకుమార్‌, ఒద్దిపర్తి లక్ష్మణా మూర్తి శర్మ, వంశీకృష్ణ, ఆలయ సిబ్బం ది, ఆయా గ్రామాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.  


logo