బుధవారం 01 ఏప్రిల్ 2020
Jagityal - Feb 10, 2020 , 01:15:00

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ కల్చరల్‌ : వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. వే కువజాముననే భక్తులు పవిత్ర  స్నానాలు ఆచరించి కోడెమొక్కు తీర్చుకున్నారు.  భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, తామెత్తు బెల్లాన్ని ఎత్తుజోకించి పంచిపెట్టారు. ఉదయం స్వామివారికి భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నాగిరెడ్డిమండపంలో గల సోమేశ్వరస్వామి వద్ద అభిషేకపూజలు,బాలత్రిపురసుందరి అమ్మవారి వద్ద కుంకుమపూజలు నిర్వహించుకున్నారు. ఆలయంలో భక్తులు కల్యాణా లు, పల్లకీ సేవలు, పెద్దసేవలు  నిర్వహించుకున్నారు.  వివిధ ఆర్జితసేవల ద్వారా రాజన్నకు సుమారు రూ.3లక్షల ఆదా యం సమకూరినట్లు, రాజన్నను దాదా పు  4 వేల  మంది భక్తులు దర్శించుకున్నారని ఆల య అధికారులు వెల్లడించారు. logo
>>>>>>