గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Feb 10, 2020 , 01:14:09

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

పెగడపల్లి : తెలంగాణ రాష్ట్రం వచ్చాకే సహకార సంఘాలకు పూర్వ వైభవం వచ్చిందని రాష్ట్ర సం క్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. ఆదివారం  మండల టీఆర్‌ఎస్‌ నాయకులు, కా ర్యకర్తలు, సహకార సంఘాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రాథమిక సహకార సంఘాల్లో మంచి పాలన కొనసాగుతోందనీ, లక్షల రూపాయల నష్టాల్లో ఉన్న సంఘాలు ప్రభుత్వ చొరవతో లాభాల బాటలో పయనిస్తున్నాయని తెలిపారు. అర్హులైన రైతులందరికీ సంఘాల ద్వారా పంట రుణాలు అందించడంతో పాటు, ఎరువులు, విత్తనాల వ్యాపారం, రైతులు పండించిన పంటల కొనుగోలు వంటి అనేక కార్యక్రమాలు చేపడుతూ రైతులకు పూర్తి నమ్మకాన్ని కలిగిస్తున్నాయన్నారు. సహకార సంఘాలన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకోవాలనీ, అందరు సమన్వయంతో ఉంటూ, డైరెక్టర్‌ స్థానాలన్నింటిని ఏకగ్రీవం చేయాలన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే పాటు పడు తున్నదనీ, టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేసి ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి  పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మం డల అధ్యక్షుడు లోక మల్లారెడ్డి, విండో చైర్మన్‌ వోరుగంటి రమణారవు, ఉప్పుగండ్ల నరేందర్‌ రెడ్డి, అమిరిశెట్టి లక్ష్మీనారాయణ, వైస్‌ ఎంపీపీ గంగాధర్‌, పార్టీ జిల్లా, మండల నాయకులు సు రేందర్‌రెడ్డి, కరుణాకర్‌రావు, భాస్కర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, ఆనందం, రాజు, వెంకన్న, రాజిరెడ్డి, న ర్సింహరెడ్డి, బాల్సాని శ్రీను, వేణు, ప్రవీణ్‌రావు, మల్లారెడ్డి, తిరుపతి, తిరుపతిరెడ్డి, కాంతయ్య, గోపాల్‌రెడ్డి, సంజీవరెడ్డి, విజయ్‌ యాదవ్‌, లక్ష్మీనారాయణ, లోకేశ్‌, వీరేశం, చిరంజీవినాయక్‌, స ర్పంచులు లక్ష్మణ్‌, కొండయ్య ఉన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు

గొల్లపల్లి : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో స్వచ్ఛందంగా చేరుతున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. గొల్లపల్లి సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా రాఘ పట్నం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జలేందర్‌ రెడ్డి ఆదివారం మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అలాగే సింగిరెడ్డి గోపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో 30మంది టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్క శంకరయ్య, జడ్పీ సభ్యుడు గో స్కుల జలేందర్‌, వైస్‌ ఎంపీపీ ఆవుల సత్యం, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బొల్లం రమేశ్‌, నాయకులు గంగాధర్‌ రావు, అశోక్‌ రావు, తిరుపతి, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

దేవాలయాల అభివృద్ధి ప్రభుత్వం కృషి..

గొల్లపల్లి : దేవాలయాల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌ క్యాంపు కార్యాలయంలో ఆదివారం  మండలంలోని మల్లన్నపేట మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా ముఖ్య ద్వారం మ్యాప్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యూత్‌ మండ లాధ్యక్షుడు బోయపోతు గంగాధర్‌, శ్రీ కోటి స్వామి, శ్రీకోటి రఘుపతి పాల్గొన్నారు. 


logo
>>>>>>