బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Feb 10, 2020 , 01:11:52

ఆలయాల్లో మాఘ పౌర్ణమి వేడుకలు

ఆలయాల్లో మాఘ పౌర్ణమి వేడుకలు

మారుతీనగర్‌: మెట్‌పల్లి పట్టణంలో మాఘ పౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని సాయిబాబా ఆలయంలో ఆదివారం వేదపండితులు ప్రత్యేకపూజలు, అభిషేకార్చనలు నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు- సరోజన దంపతులు పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు. సాయినాథుడిని దర్శించుకున్న భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

సామూహిక సత్యనారాయణ వ్రతాలు 

కోరుట్ల: పట్టణంలోని శ్రీసాయిబాబా ఆలయం లో మాఘపౌర్ణమిని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ వ్రతాలను ఆదివారం ఘ నంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయినాథుడికి ప్రత్యేకపూజలు పంచామృతాభిషేకాలు, పల్లకీసేవ తదితర కార్యక్రమాలను నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో పలువురు దంపతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌-సరోజన దంపతులు సత్యనారాయణ వ్ర తంలో పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాఘపౌర్ణమి సందర్భంగా కానుకల రూపంలో ఆలయానికి రూ.1,28,060 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధ్యక్షుడు పోతని భూమయ్య తెలిపారు. 

 వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం 

పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. వేద పండితులు శ్రీపాద లక్ష్మీనర్సింహశాస్త్రీ, చేపూరి విజయాచార్యుల వేదమంత్రోచ్ఛరణల మధ్య శ్రీగోవిందమాంబ సమేత శ్రీమద్విరాట్‌ పోతులూరి వీబ్రహ్మేంద్రస్వామి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాగా, ఉదయం నుంచి స్వామివారికి సుప్రభాత సేవ, ప్రత్యేకపూజలు, పంచామృతాభిషేకాలు, ధ్వజారోహణ తదితర కార్యక్రమాలను చేపట్టారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కల్యాణంలో పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు. భక్తులకు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నాయకులు వెగ్యారపు శ్రీరాములు, బెజ్జారపు శ్రీనివాస్‌, వెగ్యారపు రాంప్రసాద్‌, ఇందూరి వేణుగోపాల్‌ తదితరులున్నారు. 


logo