సోమవారం 30 మార్చి 2020
Jagityal - Feb 09, 2020 , 01:54:07

అభివృద్ధి పనులు పూర్తిచేయాలి

అభివృద్ధి పనులు పూర్తిచేయాలి

జగిత్యాల, నమస్తే తెలంగాణ : జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ గుగులోతు రవి పేర్కొన్నారు. ఈ మేరకు శనివా రం కలెక్టరేట్‌లోని చాంబర్‌లో అధికారులతో స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ము న్సిపాలిటీల వారీగా పనుల వివరాలను అధికారు ల నుంచి అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ ల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, డస్ట్‌బిన్‌, డోర్‌ టూ డో ర్‌ చెత్త సేకరణ, స్మృతివనం, దవాఖానల్లో బయోవేస్టేజ్‌, రోడ్‌సైడ్‌ టాయిలెట్స్‌, డంపింగ్‌ యార్డు, మున్సిపాలిటీల్లో వర్కర్‌లతోపాటు ఆటోలు, రిక్షా లు నిర్వహణపై ఆరా తీశారు. పారిశుధ్యంపై దృష్టిపెట్టి అన్ని పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలలనీ, కమిషనర్‌ ఉదయాన్నే పారిశుధ్య కార్మికులు విధు లు నిర్వహిస్తున్నరా? లేదా? చూడాలని ఆదేశించారు. వీధుల్లో ఎక్కడ కూడా చెత్తలేకుండా చర్య లు చేపట్టాలని కమిషనర్లకు సూచించారు. సమావేశంలో జేసీ బేతి రాజేశం, డీఆర్వో అరుణశ్రీ, ఆర్డీఓ నరేందర్‌, కమిషనర్లు పాల్గొన్నారు.

కొత్త కలెక్టరేట్‌ పనుల పరిశీలన

జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయ భవన నిర్మాణం పనులను శనివారం కలెక్టర్‌ పరిశీలించా రు. భవన సముదాయాన్ని జేసీ రాజేశం, ఆర్డీఓ నరేందర్‌తో కలిసి సందర్శించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించి, కలెక్టరేట్‌ భవన నిర్మాణ మ్యాప్‌ను జిల్లా పాలనాధికారి పరిశీలించారు.  

తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత పిల్లలదే

జగిత్యాల టౌన్‌ : వయో వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ, భద్రత బాధ్యత పిల్లలదేననీ కలెక్టర్‌  రవి పేర్కొన్నారు. శనివారం నూతనంగా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనను తెలంగాణ ఆల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ జగిత్యాల జిల్లాశాఖ అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్‌, మండల కార్యవర్గాల ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తల్లిదండ్రుల, వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం మేరకు బదిలీ కలెక్టర్‌ శరత్‌ ఆధ్వర్యంలో ట్రిబ్యునల్‌ అధికారి ఆర్డీవో నరేందర్‌ వృద్ధుల కేసుల పరిష్కారం లో జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచినందు కు అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్‌, గౌరవ సలహాదారు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ జీ.ఆ ర్‌.దేశాయి, జి ల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ సాజిద్‌, జిల్లా, డివిజన్‌, నియోజకవర్గ, మండల, పట్టణాల నా యకులు మా నాల కిషన్‌, అలిశెట్టి ఈశ్వరయ్య, మరిపల్లి నారాయణ, విద్యాసాగర్‌, ప్రకాశ్‌రావు, దోనూరి లక్ష్మీకాంతం, పబ్బా శివానందం, బి.కరు ణ, గుడ్ల గంగాధర్‌, సైఫొద్దీన్‌, రాజ్‌మోహన్‌, నలువాల హన్మాండ్లు, సింగం గంగాధర్‌ పాల్గొన్నారు. 

కలెక్టర్‌కు శుభాకాంక్షలు

జగిత్యాల అర్బన్‌ : కలెక్టర్‌ రవిని శనివారం జగిత్యాల ఐఎంఏ వైద్యులు, సబ్‌ రిజిస్ట్రార్‌ నరేశ్‌ వేర్వేరుగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ తాటిపాముల సురేష్‌ కుమార్‌, రాచకొండ శ్రీనివాస్‌, మోర సుమన్‌ కుమార్‌, వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు.


logo