శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Jagityal - Feb 09, 2020 , 00:32:25

రాజీమార్గమే రాచమార్గం

రాజీమార్గమే రాచమార్గం

కోరుట్లటౌన్‌: రాజీమార్గమే రాచ మార్గమని, కక్షిదారులు జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల కోర్టు న్యాయమూర్తి శ్యామ్‌కుమార్‌ పేర్కొన్నారు. పట్టణంలోని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించి మాట్లాడారు. లోక్‌ అదాలత్‌ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని, ఉచితంగా కేసులు పరిష్కారమవుతాయన్నారు. లోక్‌ ఆదాలత్‌లో తీర్పు చెప్పిన కేసులకు హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుండదన్నారు. కాగా, లోక్‌ అదాలత్‌లో 31 కేసులు పరిష్కారం కాగా, వీటిలో మైనట్లు ఒకటి సివిల్‌, 30 క్రిమినల్‌ కేసులున్నాయన్నారు. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కటుకం రాజేంద్రప్రసాద్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మచ్చ వెంకటరమణ మూర్తి, కోశాధికారి వొటారికారి శ్రీనివాస్‌, లోక్‌ అదాలత్‌ సభ్యులు బైరి విజయ్‌కుమార్‌, కొంపెల్లి సురేశ్‌, న్యాయవాదులు కడకుంట్ల సదాశివరాజు, వినోద్‌, సదానందనేత, రాజేశ్‌ఖన్నా, విజయ్‌, సంధ్య తదితరులున్నారు. 

మెట్‌పల్లి,నమస్తే తెలంగాణ: స్థానిక కోర్టులో  లోక్‌ అదాలత్‌ నిర్వహించి 32కేసులను పరిష్కరించారు. మెట్‌పల్లి మున్సిఫ్‌ కోర్టు మెజిస్ట్రేట్‌ అజయ్‌కుమార్‌ జాదవ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి, న్యాయవాదులున్నారు. 

జగిత్యాల లీగల్‌: జగిత్యాల కోర్టు ఆవరణలో లోక్‌ అదాలత్‌లో జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో 163కేసులను పరిష్కరించినట్లు ఎస్పీ సింధు శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. జగిత్యాల టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో-5, జగిత్యాల ట్రాఫిక్‌ స్టేషన్‌ పరిధిలో-1, జగిత్యాల రూరల్‌ స్టేషన్‌ పరిధిలో-21, సారంగాపూర్‌ స్టేషన్‌ పరిధిలో-5, బీర్‌పూర్‌ స్టేషన్‌ పరిధిలో-4, రాయికల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో-6, ధర్మపురి స్టేషన్‌లో 13, వెల్గటూర్‌ పరిధిలో-8, గొల్లపల్లి -9, బుగ్గారం-4, మల్యాల-8, కొడిమ్యాల-20, పెగడపల్లి -7, కోరుట్ల -23, మేడిపల్లి -4, కథలాపూర్‌ -5, మెట్‌పెల్లి -8, ఇబ్రహీంపట్నం -8, మల్లాపూర్‌ స్టేషన్‌ పరిధిలో -4కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. 63కేసులను పరిష్కరించడంలో శ్రద్ద కనబరిచిన పోలీస్‌ అధికారులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు. 


logo