ఆదివారం 24 మే 2020
Jagityal - Feb 08, 2020 , 02:03:47

ఉపాధ్యాయులు అదే స్ఫూర్తితో పనిచేయాలి

ఉపాధ్యాయులు అదే స్ఫూర్తితో పనిచేయాలి

జగిత్యాల, నమస్తే తెలంగాణ :  మూడేళ్లుగా  పది  ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో ఉపాధ్యాయులు అదే స్ఫూర్తితో పని చేయాలని కలెక్టర్‌ జీ రవి సూ చించారు. జిల్లాలో పునరుత్తేజం కార్యక్రమంపై శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో జీవితంలో మలుపు తిరిగే మొదటి పరీక్ష పదో తరగతన్నారు. మూడేళ్లుగా  జిల్లా  రాష్ట్రంలో మొదటి స్థానంలో వ స్తుందో అదే స్ఫూర్తితో కృషి చేయాలన్నారు. మం డల, పాఠశాల ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయు లు పాఠశాలలోకి వెళ్లినప్పుడు ఉపాధ్యాయులు పరీక్షలు పెట్టే విధానాన్ని, చెక్‌లిస్టు తయారు చేసి దాని ప్రకారం ప్రత్యేక అధికారులు చూడాలన్నా రు. ఏ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం తగ్గితే ఆపాఠశాల యొక్క ప్రత్యేక అధికారి చొరవ తీసుకోలేదని అర్థమవుతుందన్నారు. జిల్లాలో జిల్లా యం త్రాంగం ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా అనేక మంది దాతలు ముందుకు వస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే సంవత్సరం 10వ తరగతితో పాటు 8, 9 తరగతులకు కూడా ఇదే విధంగా పరీక్షలు పెడుతూ విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఏంఈఓలు ప్రతీ పాఠశాలను తనిఖీ చేయాలనీ, ఈ విషయమై జాబ్‌చార్ట్‌పై సమీక్ష నిర్వహిస్తామన్నారు. కుటుంబ సభ్యులు ఎదో ఒక ఆశతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో మన మీద నమ్మకంతో పంపిస్తున్నారనీ, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా మన విధులు మనం సక్రమంగా నిర్వర్తించి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ బేతి రాజేశం మాట్లాడుతూ  మూడేళ్లుగా రాష్ట్రంలో ఏ విధంగానైతే మొదటి స్థానంలో ఉం దో అదే ఒరవడితో ఈసారి కూడా మొదటి స్థానం సంపాదించాలన్నారు. మూడు సార్లు జిల్లా మొ దటి స్థానంలో నిలవడానికి జిల్లా యంత్రాంగం తో పాటు ఉపాధాయయులు ఎంతో శ్రమపడ్డారనీ, ఆ శ్రమ ఫలితమే రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారన్నారు. అదే స్పూర్తితో 4వ సారి కూడా మొదటి స్థానంలో నిలిచే విధంగా కష్టపడి ఈ ఏడాది కూడా పనిచేయాలన్నారు.   జగిత్యాల ఎంఈఓ నారాయణ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంఈఓలు మా పరిధి లో ఉన్న పాఠశాలలను తనిఖీ చేస్తున్నామన్నారు.  పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్‌ కోసం దాతల నుంచి సేకరించిన విరాళాలు రెండు సంవత్సరాలకు సరిపడా సేకరించినట్లు తెలిపారు. సబ్జెక్టు టీచర్లు లేని వద్ద కలెక్టర్‌ చొరవతో ప్రైవేటు వాళ్లను తీసుకుని పాఠాలు చెప్పిస్తున్నామన్నారు.  ఈ కా ర్యక్రమంలో డీఆర్వో అరుణశ్రీ, డీఈఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓలు, ప్రత్యేక అధికారులున్నారు. 

 పారిశుధ్య పనులను పర్యవేక్షించాలి..

  ప్రతి రోజు మున్సిపాలిటీలో పారిశుధ్యం పనుల ను ప్రత్యేకంగా కమిషనర్లు పర్యవేక్షించాలని కలెక్టర్‌ జీ రవి సూచించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పారిశుధ్యం పనుల గురించి కమిషనర్లతో కలెక్టరేట్లో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రతి మున్సిపాలిటీలో ఎంత మంది పారిశుధ్య సిబ్బంది పనుల్లో ఉన్నారు. ఇంకా ఎంత మంది అవసరం ఉంది, వాహనాలు సరిగా ఉన్నా యా, ఆటోలు, రిక్షాలు సరిపడా ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు.  ప్రతి మున్సిపాలిటీలో ఉదయ మే మున్సిపల్‌ కమిషనర్లు స్థానికంగా ఉండి ఉదయమే పారిశుధ్యం పనులు ఏ విధంగా ఉన్నాయో స్వయంగా వెళ్లి తనిఖీలు చేయాలని ఆదేశించారు.  మున్సిపాలిటీల్లో ఉన్న పార్కులను అభివృద్ధి చేయాలన్నారు. ఏ పనులు చేయాలన్న విషయాలపై పరిశీలిస్తున్న ఫోటోలను గ్రూప్‌లో పెట్టాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ బేతి రా జేశం, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.  

హరితహారం విజయవంతం చేయాలి..

  జిల్లాలో ఐదో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ రవి సూచిం చారు. జగిత్యాల జిల్లాలో ఐదో విడత హరితహారం నర్సరీపై శుక్రవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్‌ తన చాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రవి మాట్లాడుతూ మొదటి, రెండో విడత పల్లె ప్రగతిలో ప్రతి గ్రా మంలో ప్రతి ఇంటికి కావాల్సిన మొక్కల, ఆవె న్యూ ప్లాంటేషన్‌, మంకీ ఫుడ్‌ కోర్టు, ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు, కార్యాలయాలకు కావాల్సిన మొక్కల గురించి సర్వే చేయడం జరిగిందన్నారు.    జిల్లాలోని అన్ని శాఖల పరిధిలో గ్రామాల్లోను పట్టణాల్లో ఎన్ని అవసరం ఉన్నాయో  సర్వే ప్రకారంగా శాఖల వారీగా రూపొందించి తయారుచేయాలని అటవీశాఖ, డీఆర్‌డీఏ, డీపీఓ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జా యింట్‌ కలెక్టర్‌ బేతి రాజేశం, బీ రాజేశం, డీఎఫ్‌ఓ నరసింహరావు, డీఆర్డీఏ పీడీ లక్ష్మీనారయణ, జి ల్లా పంచాయతీ అధికార వేముల శేఖర్‌, ఐదు మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు. 

 నులి పురుగుల నిర్మూలన ఏర్పాట్లపై కలెక్టర్‌ సమీక్ష

 జాతీయ నులి పురుగుల నిర్మూలన ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో శుక్రవారం సంబంధిత అధికారులతో  కలెక్టర్‌ జీ రవి తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వ హించారు. ఈ  సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ నులి పురుగుల మాత్రలు జిల్లాలో 2.50 లక్షల మాత్రలు అవసరం ఉన్నాయనీ, అన్ని సరి పడా జిల్లాకు సరఫరా చేశారన్నారు. నులి పురు గుల దినోత్సవం ఫిబ్రవరి 10న నిర్వహిస్తారని, ఆ రోజు అందుబాటులో లేని వారికి ఫిబ్రవరి 17న నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వీటిపై ఇదివరకే పాఠశాల, కళాశాలల్లో మాత్రలు ఎలా వేయాలనే విషయం చెప్పడం జరిగింద న్నారు. జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌, జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్‌ రెడ్డి, వైద్యులు పాల్గొన్నారు. logo