శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jagityal - Feb 08, 2020 , 02:08:31

పోటాపోటీగా ‘సహకార’ నామినేషన్లు

పోటాపోటీగా ‘సహకార’ నామినేషన్లు

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో జరుగుతున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో రెండో రోజైన శుక్రవారం పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రెం డోరోజు ఏకంగా 618 నామినేషన్లు వచ్చాయి. సహకార సంఘాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రైతులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కొన్ని ముఖ్యమైన సంఘాలకు ప్రాతినిధ్యం వహించేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. చివరి రోజైన శనివారం సహకార సంఘాలకు నామినేషన్లు వెల్లువలా వచ్చి అవకాశాలున్నాయి. ఇప్పటివరకు కొన్ని సంఘాలకు అరకొరగా నామినేషన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో చివరిరోజు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కావచ్చని అధికారులు భావిస్తున్నారు. కొన్ని సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతు లు ముందు నుంచే ప్రణాళికా ప్రకారంగా ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కో ప్రాదేశిక నియోజకవర్గంలో ఒక్కో నామినేషన్‌ మాత్రమే వచ్చే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు సంఘాలకు ఇప్పటివరకు తక్కువ నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. శనివారం ఆఖరు రోజు కావడంతో కొన్ని డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశముంది. దాఖలైన నామినేషన్ల పత్రాల పరిశీలన ప్రక్రియను అధికారులు ఆదివారం చేపడతారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక అదే రోజు సాయంత్రం ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల జాబితాను ఖరారు చేసి గుర్తులను కేటాయిస్తారు.

రెండో రోజు నామినేషన్ల వారీగా.. 

జిల్లాలో 51 సంఘాలకు ఎన్నికలు జరుగనుండగా, రెండో రోజు జిల్లా వ్యాప్తంగా 618 నామినేషన్లు దాఖలయ్యాయి. బీర్‌పూర్‌లో 6, కొల్వాయిలో 9, ధర్మపురిలో 6, జైనలో 13, తిమ్మాపూర్‌(ధర్మపురి)లో 11, చందోలిలో 01, గొల్లపెల్లిలో 17, ఇబ్రహీంపట్నంలో 9, తిమ్మాపూర్‌లో 16, యామాపూర్‌లో 10, జగిత్యాలలో 21, కల్లెడలో 13, భూషణ్‌రావుపేటలో 14, గంభీర్‌పూర్‌లో 17, సిరికొండలో 17, కొడిమ్యాలలో 25, పూడూర్‌లో 17, తిర్మలాపూర్‌లో 19, ఐలాపూర్‌లో 10, చిన్నమెట్‌పెల్లిలో 16, కోరుట్లలో 13, మాదాపూర్‌లో 15, పైడిమడుగులో 2, యఖీన్‌పూర్‌లో 10, చిట్టాపూర్‌లో 04, మల్లాపూర్‌లో 22, ముత్యంపేటలో 09, సిర్‌పూర్‌లో 14, మల్యాలలో 12, నూకపెల్లిలో 16, తక్కల్లపెల్లిలో 21, బీర్‌పూర్‌లో 4, మేడిపెల్లిలో 8, పోరుమల్లలో 4, వల్లంపెల్లిలో 9, బండలింగాపూర్‌లో 6, మెట్లచిట్టాపూర్‌లో 22, మెట్‌పెల్లిలో 9, నంచర్లలో 26, నందగిరిలో 13, పెగడపల్లిలో 19, అల్లీపూర్‌లో 6, భూపతిపూర్‌లో 9, ఇటిక్యాలలో 12, రాయికల్‌లో 9, ఉప్పుమడుగులో 10, కోనాపూర్‌లో 13, సారంగాపూర్‌లో 10, ఎండపెల్లిలో 17, వెల్గటూర్‌లో 17 చొప్పున నామినేషన్లు దాఖలయినట్లు సింగిల్‌విండో ఎన్నికల అసిస్టెంట్‌ ఎలక్షన్‌ అథారిటీ రామానుజాచార్యులు తెలిపారు. 


logo