గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Feb 08, 2020 , 01:53:15

ప్రభుత్వ దవాఖానలో అరుదైన శస్త్ర చికిత్స

ప్రభుత్వ దవాఖానలో అరుదైన శస్త్ర చికిత్స

కరీంనగర్‌ హెల్త్‌: చిన్న పేగుకు రంద్రం పడి ప్రా ణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తిని జగిత్యాల జిల్లా ప్రభుత్వ దవాఖానా నుంచి కరీంనగర్‌ ప్రభుత్వ దవాఖానకు రెఫర్‌ చేశారు. కాగా, దవాఖానలో చేరిన 24 గంటల్లోనే అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రాణం పోసిన కరీంనగర్‌ ప్రభుత్వ దవాఖాన వైద్యులను దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌, రోగి బంధువులు అభినందించారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లికి చెందిన శ్రీనివాస్‌ కడుపు నొప్పి తో బాధపడుతూ గత కొన్ని నెలలుగా ఎన్నో దవాఖానలు తిరిగాడు. ఎక్కడా కడుపు నొప్పి తగ్గలే దు. జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు వెళ్లగా అక్క డి వైద్యులు శ్రీనివాస్‌ పరిస్థితి విషమంగా ఉందని గురువారం సాయంత్రం 6 గంటలకు కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దవాఖానలో సర్జన్లుగా పని చేస్తున్న సాయిప్రసాద్‌, బషీర్‌లు శ్రీనివాస్‌ను పరీక్షించి స్కానింగ్‌ చేయగా (డియోడినం పెర్పరేషన్‌) చిన్న పేగుకు రంద్రం ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమించడంతో వెంటనే శస్త్ర చికిత్స చేయాలని కుటుంబ సభ్యులకు సూ చించారు. వారు సమ్మతించడంతో ఉదయం 10 గంటలకు శస్త్ర చికిత్స చేశారు. శ్రీనివాస్‌ ప్రస్తుతం ఐసీయులో కోలుకుంటున్నాడు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. సరైన సమయంలో తీ సుకురావడంతో ప్రాణాపాయం తప్పిందని, పది రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడని తెలిపారు. శస్త్ర చికిత్సలో అనస్థిషియా వైద్యుడు శ్రీకాంత్‌, ఇన్‌చా ర్జి సిస్టర్లు ప్రభులత, పద్మశ్రీ, వార్డు బాయ్‌లు ఉ న్నారు. కాగా, వైద్య బృందాన్ని సూపరింటెండెం ట్‌ అజయ్‌కుమార్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ శౌరయ్య, ఏవో నజీముల్లాఖాన్‌ అభినందించారు. 


logo