బుధవారం 01 ఏప్రిల్ 2020
Jagityal - Feb 07, 2020 , 01:36:51

ప్రతి ఇంటికీ సాయం

ప్రతి ఇంటికీ సాయం

గొల్లపల్లి : అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రతి ఇంటికీ సాయం చేస్తూ అన్నీతానై అండగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ సం క్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పష్టం చేశారు. గొల్లపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో 42 మందికి రూ.42,04,872 విలువ గల కల్యాణ లక్ష్మి చెక్కులను జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత తో కలిసి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు పెద్ద దిక్కులా నిలచిందన్నా రు. పేద, మధ్య తరగతి ఇళ్లల్లో ఆడపిల్లల పెళ్లి ఎం తో కష్టంగా మారిందని, వారి కష్టాలను తీర్చేందు కే ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.


ప్రతి ఇంటికీ పిం ఛన్‌, ప్రతి రైతుకు రైతుబంధు, రైతుబీమా అందించడం గర్వంగా ఉందన్నారు. ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందుతున్న వారు మరిచిపోకుండా విధేయతగా ఉండాలని కోరారు. చందోలిలో కంపోస్టు షె డ్డును ప్రారంభించి సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు నీరు పట్టారు. మల్లన్నపేటలో  మల్లికార్జున స్వామి ఆలయానికి రూ.50లక్షలతో గాలి గోపు రం నిర్మాణానికి, జడ్పీ ఉన్నత పాఠశాల వరకు రూ.4.60లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పెగడపల్లి మండలం నంచర్ల రామాలయ గాలిగోపురం నిర్మాణానికి సైతం రూ.50లక్షల నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.  


ఆలయాల అభివృద్ధితో పాటు అన్ని కులాలకూ సమన్యాయం పాటిస్తూ హిందూ, ముస్లిం, క్రైస్తవ పం డగలకు కానుకగా బట్టలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రజలంతా పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఎంపీపీ నక్క శంకరయ్య, జడ్పీ సభ్యుడు జలందర్‌, వైస్‌ ఎంపీపీ ఆవుల సత్తయ్య, సర్పంచులు అలిశెట్టి రవీందర్‌, సిద్దెంకి నర్సయ్య, ఎంపీటీసీలు చింతం అశోక్‌, గోస్కుల రాజన్న, జేసీ రా జేశం, తహసీల్దార్‌ నవీన్‌ కుమార్‌, ఎంపీడీవో నవీ న్‌ కుమార్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కిష్టారెడ్డి, విండో అధ్యక్షుడు నారాయణ రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రమేశ్‌, యూత్‌ అధ్యక్షు డు గంగాధర్‌, జలంధర్‌, రాజశేఖర్‌, మల్లారెడ్డి, కిషన్‌, సత్తయ్య, గంగారెడ్డి, అశోక్‌ రావు, హన్మాం డ్లు, నల్లగొండం గౌడ్‌, రమేశ్‌, రాంచందర్‌ రెడ్డి, లింగారెడ్డి పాల్గొన్నారు.


logo
>>>>>>