మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Feb 07, 2020 , 01:31:27

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ఇబ్రహీంపట్నం: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేం దుకు కృషి చేస్తున్నామని కలెక్టర్‌ గుగులోతు రవి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని తాసిల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలను పరిశీలించారు. అనంతరం ఆయా శాఖల అధికారులు, ప్ర జాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిదులతో మాట్లాడి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎం పీడీవో కార్యాలయ ఆవరణలో స్థానిక అధికారు లు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటా రు. ఇబ్రహీంపట్నం గ్రామ శివారులోని ఉపాధి హామీ నర్సరీని పరిశీలించారు. అక్కడి నుంచి డబ్బా వాటర్‌గ్రిడ్‌ను పరిశీలించారు. వాటర్‌ గ్రిడ్‌ ఏఈ మల్లేశం ఈ సందర్భంగా శుద్ధజల వివరాలను కలెక్టర్‌తో వివరించారు. డబ్బ గ్రామశివారులో ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్‌ కోర్టును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నర్సరీల్లో నాటుతున్న మొక్కలను పరిరక్షించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వాటర్‌గ్రిడ్‌ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని సకాలంలో పంపిణీ చేసే విధంగా అధికారులు చ ర్యలు చేపట్టాలన్నారు. 


ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చే స్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న భూ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీ సుకుంటామని వివరించారు, నర్సరీ, ఇంకుడుగుంతల పనులను వేగవంతం చేయాలని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సేవలను అందించాలని సూచించారు. విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మండలానికి రాగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పూలమాల లు, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో డబ్బ గ్రామ సర్పంచ్‌ లింగంపల్లి గంగాదర్‌, ఎంపీపీ జాజాల భీమేశ్వరి, జడ్పీటీసీ కముఠం భా రతి, డీఆర్‌ఓ అరుణశ్రీ, తాసిల్దార్‌ శ్రీలత, ఎంపీడీవో శైలజారాణి, ఎంపీటీసీలు పడాల మమత, తిమ్మని రాములు, నాయకులు నేమూరి సత్యనారాయణ, కంఠం రమేశ్‌, జగన్‌రావు, రా జారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>