గురువారం 09 ఏప్రిల్ 2020
Jagityal - Feb 06, 2020 , 02:15:28

కల్వకోటను ఆదర్శంగా తీసుకోవాలి

కల్వకోటను ఆదర్శంగా తీసుకోవాలి
  • ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితోనే గ్రామాల అభివృద్ధి
  • కలెక్టర్‌ గుగులోత్‌ రవి మేడిపల్లిలో కార్యాలయాల తనిఖీ
  • పదో తరగతిలో ఈసారి కూడా వంద శాతం ఫలితాలు సాధించాలి

మేడిపల్లి :  అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధిం చిన కల్వకోట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ రవికుమార్‌ ఇతర గ్రామాల పాలకవ ర్గా లకు సూచించారు.  బుధవారం మేడిపల్లి మం డ ల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను   కలెక్టర్‌  తనిఖీ చేశారు. తాసిల్దార్‌ కార్యాలయంలో డిజిటల్‌ సంతకాలు, ధరణి, మీ సేవా దరఖాస్తుల పెండింగ్‌, కార్యాలయం నుంచి జారీ చేసే వివిధ సర్టిఫికెట్‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. మీ సేవా కేంద్రంలోని రికార్డు రూములను పరిశీలించారు. అన్ని కార్యాలయాల్లో  సీసీ కెమెరాలను ఏ ర్పాటు చేసి కలెక్టర్‌ ఆఫీసుకు అనుసంధా నించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 


మేడిపల్లిలోని వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, మంకీ పోర్టు కోర్టులను పరిశీలించారు. అనంతరం  జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు.  ఇక్కడ ఏర్పాటు చేసిన తడి చెత్త కంపోస్టు ఫిట్‌ను పరిశీలించారు. ప్రజాప్రతినిధు లు, అధికారులు సమన్వయంతో పని చేసినప్పుడే అభివృద్ధి జరుగుతుందనీ, ఇందుకు నిదర్శనంగా కల్వకోట నిలుస్తుందన్నారు.  పదో తరగతి ఫలితాల్లో వరుసగా మూడు సంవత్సరాలు 100 శా తం ఉత్తీర్ణత సాధించారని, ఈ సంవత్సరం కూడా  సంపూర్ణ ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెరుగైన ఫలితాల సాధనకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. 8, 9వ తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టర్‌  రవినాయక్‌, డీఆర్వో అరుణశ్రీని  జడ్పీ ఉపాధ్యక్షుడు వోద్దినేని హరిచరణ్‌రావు, ఎంపీపీ దోనకంటి ఉమాదేవి  సన్మానించారు. తదనంతరం జ్యూట్‌ బ్యాగులు పంపిణీ చేశారు.   సర్పంచ్‌ ఆదె హన్మక్క, ఎంపీటీసీ ఆదె రాజన్న, తాసిల్దార్‌ రాజేశ్వర్‌, ఎంపీడీఓ పద్మజ, ఆర్‌ఐ నగేష్‌, నేతలు ఆదె లక్ష్మీరాజం, గాజిపాషా పాల్గొన్నారు. 


ఎన్నికలను సజావుగా నిర్వహించాలి..

జగిత్యాల, నమస్తే తెలంగాణ:  సహకార ఎన్నికలను సజావుగా నిర్వహించాలని  కలెక్టర్‌ జీ రవి అధి కారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని తాసిల్దా ర్‌ కార్యాలయాల వారీగా బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల వారీగా ఆయా కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న సర్టిఫికెట్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, పాస్‌ పుస్తకాలు పంపిణీ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పట్టేదారుపాసు పుస్తకాల కోసం  రానిపక్షంలో వారి ఇంటికి రిజిస్టర్‌ పోస్టులో పంపించాలన్నారు. మండలాల్లో సర్వే పెండింగ్‌లో ఉన్న వా టిని వెంటనే అన్నింటిని మండలాల  వారీగా వా రం రోజుల్లోగా పరిష్కరించాలని సూచించారు. ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తానని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం కార్యాలయాలకు రాగానే పెండింగ్‌ఫైళ్లను  పరిశీలించి క్లియర్‌ చేయాలని నిర్దేశించారు. తాసిల్దార్లు వారి మండలాల పరిధిలో సహకార ఎన్నికలు జరిగే ప్రాం తాల్లో రూట్స్‌, బందోబస్తు, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను తనిఖీ చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో  జాయింట్‌ కలెక్టర్‌ బేతి రాజేశం, డీఆర్వో అరుణశ్రీ, డీసీవో రామానుజచారి, తాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు. 


logo