బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Feb 06, 2020 , 02:13:14

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

నేటి నుంచి  నామినేషన్ల స్వీకరణ

పెగడపల్లి: మండలంలోని మూడు సహకార సంఘాల ఎన్నికలకుగురువారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు.  పెగడపల్లి, నంచర్ల, నందగిరి ప్రాథమిక సహకార సంఘాలుండగా, వీటికి  సంబంధించి ఓటరు జాబితా, డైరెక్టర్ల వారీ గా రిజర్వేషన్‌ వివరాలను రెండు రోజుల క్రితమే విడుదల చేశారు. 6నుంచి నుంచి 8వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. పెగడపల్లి సహకార సం ఘంలో ఎన్నికల అధికారి షంషేర్‌అలీ, సీఈవో తడ్కమడ్ల గోపాల్‌రెడ్డి,  నంచర్ల సహకార సంఘం లో ఎన్నికల అధికారి ఎండీ. సలీం, సీఈవో రైతు మధుకర్‌, నందగిరి సహకార ఎన్నికల అధికారి రంజిత్‌కుమార్‌, సీఈవో సంకిటి రవీందర్‌రెడ్డి స్వీకరించనున్నారు. 9న పరిశీలన, 10న  ఉప సంహరణ, అదే రోజు సాయంత్రం గుర్తుల కేటాయింపు, బరిలో ఉన్న అభ్యర్థులను అధికారులు ప్రకటించనున్నారు. 15న ఉదయం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌,  మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.


logo