సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Feb 05, 2020 , 01:38:28

ఆడబిడ్డల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

ఆడబిడ్డల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
  • వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
  • జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం రూ.300కోట్ల రుణాలు
  • వివిధ రకాల వస్తువుల తయారీకి ఉచిత శిక్షణ
  • బ్యాంకు లింకేజీ రుణాల మంజూరులో జిల్లాకు మూడోస్థానం
  • రికవరీలో మొదటి స్థానం
  • రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  • సెర్ప్‌ కార్యక్రమాలపై ధర్మపురిలో సమీక్షా సమావేశం
  • 16గ్రామాలకు ట్రాక్టర్ల అందజేత
  • గ్రామ స్వరాజ్యానికి బాటలు వేయాలని పిలుపు

ధర్మపురి, నమసే ్తతెలంగాణ:  ఆడబిడ్డల ఆర్థికాభివృద్ధే సర్కారు లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పష్టం చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ, సెర్ప్‌) ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై ధర్మపురిలో అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలతో మంగళవారం నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి ఆర్థిక స్వావలంబన కలిగిచేందుకే మహిళలకు సంఘాల ద్వారా రుణాలు అందిస్తున్నామనీ, వాటని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని పిలుపునిచ్చారు.


ఆడబిడ్డల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ  లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పష్టం చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలతో ధర్మపురిలో మంగళవారం నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ  మహి ళా సంఘాలకు రుణాల వడ్డీ చెల్లింపుల కోసం ప్ర భుత్వం ఇటీవలే  రూ.617 కోట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆ కుటుంబంలోని మహిళలను సంఘాల ద్వారా రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఒక్కో మహిళకు సెర్ప్‌ ద్వారా ప్రస్తుతం రూ.5లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. వీటిని సద్వినియోగం చే సుకొని అనేక మంది మహిళలు వారివారి కుటుంబాలను ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండాముందుకు తీసుకెళ్తున్నారన్నారు. రుణాలతోనే వారి  పిల్లలకు ఉన్నత విద్యనందిస్తున్నారన్నారు. బ్యాంక్‌ లింకేజీ, స్త్రీనిధి ద్వారా ఒక్క జగిత్యాల జిల్లా మహిళలకే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.300కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామని తెలిపారు. 


బ్యాంకు లింకేజీ రుణాల్లో రాష్ట్రంలోనే జిల్లా మూడో స్థానంలో ఉండడం, రికవరీలో ప్రథ మ స్థానంలో ఉండడం అభినందనీయమన్నారు. సెర్ప్‌ ద్వారా జ్యూట్‌, పేపర్‌ బ్యాగులు, పలు రకాల వస్తువుల తయారీ కోసం మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 3వేల రకాల బ్యాగులు కట్టేందుకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. బ్యాగుల తయారీకి మెటీరియల్‌, డిజైన్స్‌ అన్నీ సదరు కంపెనీల యాజమాన్యమే ఇస్తుందని, కేవలం బ్యాగులు కుట్టుడం ద్వారా ఒక్కో మహిళ రోజు రూ.300 నుంచి రూ.400దాకా సంపాదించుకునే అవకాశం లభిస్తుందన్నారు. కుట్టుమిషన్ల కోసం ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. సంఘాల మహిళల కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల వద్ద రూ.5లక్షలతో పర్మినెంట్‌గా విద్యుత్‌, తాగునీరు, స్టోర్‌ రూమ్‌ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. వీఓఏల జీతాల పెంపు సీఎం కేసీఆర్‌ దృష్టిలో ఉందన్నారు. 


పాడిపై మహిళలకు అవగాహన..

మహిళా రైతులకు పాడిపరిశ్రమపై అవగాహన కల్పించి రూ.4లక్షల విలువ గల పాడిగేదెల యూనిట్‌ ఇస్తామని, వీటిద్వారా నెలకు రూ.40వేల నుంచి రూ.50వేల దాకా సంపాదించవచ్చన్నారు. మహిళ పాడి రైతులను కరీంనగర్‌ డైయిరీలో సభ్యులుగా నమోదు చేయిస్తామని చెప్పారు. అరెకరం వ్యవసాయ భూమి ఉన్న మహిళా రైతులకు కూరగాయలు సాగుచేసుకునేందుకు రూ.3.50లక్షల రుణాన్ని అందిస్తామని, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తామని వివరించారు. వడ్డీలేని, సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించి తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి ఈశ్వర్‌ను మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు..


గ్రామ స్వరాజ్యానికి బాటలు వేయాలి..

జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ పాలకులు, ప్రజలు పోటీతత్వంతో ముందుపోతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేయాలని మంత్రి ఈశ్వర్‌ పిలుపునిచ్చారు. పల్లెప్రగతిలో భాగంగా ఆయా గ్రామ పంచాయతీల కోసం కొనుగోలు చేసిన 16 ట్రాక్టర్లను ఆయా గ్రా మాల సర్పంచులకు అందజేశారు. ప్రభుత్వం అ త్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాలు విజయవంతమయ్యాయని గుర్తుచేశా రు. గ్రామాల్లో నిరంతరం పారిశుధ్య, పచ్చదనం పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకే ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ప్రతీ గ్రామ పంచాయ తీ పరిధిలో డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామా లు, మంకీఫుడ్‌కోర్టులు, నర్సరీలను ఏర్పాటు చే స్తున్నట్లు చెప్పారు. దోమలు  వృద్ధి చెంద కుండా కృష్ణ తులసి, వేప, కరివేప, నాలుగు రకాల పండ్ల మొక్కలను ఇంటింటికీ అందించామన్నారు.

కార్యక్రమాల్లో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్‌, బత్తిని అరుణ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సంగి సత్తమ్మ, ఏఎంసీ చైర్మన్‌ అయ్యోరి రాజేశ్‌కుమార్‌, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, తాసిల్దార్‌ రవీందర్‌, ఎంపీవో మేరుగు శ్రీధర్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ అక్కనపల్లి సునీల్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ గడ్డం మహిపాల్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ సౌళ్ల భీమయ్య, సెర్ప్‌ ఏపీఎంలు ,వీవోఏలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


logo