సోమవారం 30 మార్చి 2020
Jagityal - Feb 05, 2020 , 01:33:32

కొండగట్టు కిటకిట

కొండగట్టు కిటకిట

మల్యాల : సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భం గా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పోటెత్తారు. మంగళవారం సుమారు 30 వేలమందికి పైగా తరలివచ్చారు. సోమవారం రాత్రి వరకే చేరుకొని ఆలయ పరిసరాల్లో బస చేసి, మంగళవారం వేకుజాము నుంచే పుష్కరిణిలో స్నానాలు చేసి స్వామివారి దర్శనానికి బారు లు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ఆర్జిత సేవలు రద్దు చేశారు. వాహన పూజల సమయాల్లో మార్పులు చేశారు. ప్రధాన ఆలయంలో స్వామి వారితో పాటు వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారు, అనుబంధ ఆలయాలైన కోదండ రామాలయం, మునిగుహలు, కొండల రాయుని అడుగులు, బేతాళ స్వామి, బొజ్జపోతన తదితర ఆధ్యాత్మిక ప్రదేశాలను భక్తు లు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.  


వారి సౌకర్యం కోసం ఉచిత, రూ.20, రూ.50, రూ. 100 ప్రత్యేక దర్శనాల టికెట్లను విక్రయించడంతో పాటు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించారు. జేఎన్టీయూ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్ల సేవలను వినియోగించుకున్నట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. స్వామివారికి సుమారు రూ.5లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు వివరించారు. కార్యక్రమం లో ఏఈవో బుద్ది శ్రీనివాస్‌, ఫౌండర్‌ ట్రస్టి మారు తి స్వామి, ఆలయ సూపరింటెండెంట్లు అంజ య్య, శ్రీనివాస శర్మ, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రాజేశ్వర్‌ రావు, సంపత్‌, పోలీస్‌ సెక్యూరిటీ విభాగం ఇన్‌చార్జి సముద్రాల రాంచంద్రం పాల్గొన్నారు. logo