శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jagityal - Feb 04, 2020 , 01:16:21

పేదలకు భరోసా సీఎంఆర్‌ఎఫ్‌

పేదలకు భరోసా సీఎంఆర్‌ఎఫ్‌

ధర్మపురి, నమస్తే తెలంగాణ : నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఆర్థికంగా భరోసా  కల్పిస్తుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సోమవారం ఆయన కరీంనగర్‌ క్యాంపు కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన 78 మంది లబ్ధిదారులకు రూ.18.20లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అత్యవసర చికిత్స కోసం దరఖాస్తులు చేసుకున్న నిరుపేదలందరికీ నేనున్నానంటూ ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా వైద్య ఖర్చులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. అలాగే ముందుగా దవాఖాన ఖర్చులు చెల్లించలేని వారికి లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌ఓసీ) అందజేస్తున్నామన్నారు. సీఎం సహాయనిధికి సచివాలయంలో ప్రత్యేక సెక్షన్‌ ఏర్పాటు చేయడం జరిగిందనీ, దరఖాస్తులు అందిన వెంటనే అధికారులు వెరిఫికేషన్‌ పూర్తి చేసి లబ్ధిదారుల పేరిట చెక్కులు సిద్ధం చేస్తారన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మంత్రి ఈశ్వర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ఆయా మండలాల నాయకులు ఉన్నారు.


logo