గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Feb 04, 2020 , 01:14:26

చెరగని ముద్ర

చెరగని ముద్ర

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా తొలి కలెక్టర్‌గా శరత్‌ తన మూడేళ్ల మూడు నెలల కాలంలో జిల్లాపై చెరగని ముద్ర వేశారు. ప్రభుత్వ పథకాలను అత్యుత్తమ రీతిలో అమలు చేయడం తో పాటు,  విద్యారంగ అభివృద్ధి, సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తేవడంలో కృతకృత్యులయ్యారు. 2016 అక్టోబర్‌ 11వ తేదీన జగిత్యాల జిల్లాగా అవతరించడంతో తొలి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శరత్‌, తన మూడేళ్ల మూడు నెలల పాల నా కాలంలో అనేక విజయాలను సాధించగలిగా రు. పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి, ఉత్తేజం కార్యక్రమంతో పిల్లలను పరీక్షలకు సన్న ద్ధం చేయించి, వరుసగా మూడు సార్లు జిల్లాను రాష్ట్రంలో తొలిస్థానంలో నిలబెట్టేలా కృషి చేశారు. 60వేల మరుగుదొడ్లను నిర్మించి, జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా చేసి, రికార్డు సృష్టించి జాతీయ అవార్డును సాధించారు. హరితహారంలో లక్ష్య సాధన మేరకు మొక్కలను నా టించడంతో పాటు, వాటిని రక్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టి, హరితహారంలో రాష్ట్రం లో జిల్లాను తొలిస్థానంలో నిలిపారు. మామిడి ఉత్పత్తులకు జగిత్యాల బ్రాండ్‌ను సృష్టించి, జాతీ య స్థాయి మార్కెట్‌లో జగిత్యాల మామిడిని ప్రవేశపెట్టేలా చేశారు. 2016 అక్టోబర్‌కు ముందు జిల్లా ప్రసవాల్లో అనేక ఆరోపణలు వినిపించాయి. అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక సిజేరియన్లు అవుతున్న జిల్లాగా జగిత్యాలకు అపవాదు రావ డం, అలాగే 80శాతం ప్రసవాలు ప్రైవేట్‌ దవా ఖానల్లో అవుతుండడాన్ని గుర్తించిన కలెక్టర్‌ శరత్‌, వాటిపై దృష్టిని సారించడంతో పాటు, ప్రభుత్వ వై ద్య సిబ్బందిని అప్రమత్తం చేసి, లక్ష్యాలను నిర్దేశించి, జిల్లాలో సిజేరియన్‌ అపరేషన్లను గణనీయంగా తగ్గించడంతో పాటు, ప్రభుత్వ దవా ఖానల్లో 70శాతం ప్రసవాలు జరిగేలా చర్యలు తీ సుకోగలిగారు. వీటితో పాటు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ, భూరికార్డుల ప్రక్షాళన, చేనేత వస్ర్తాల కొనుగోలు, తదితర అంశాల్లో జిల్లా ను శరత్‌ అగ్రస్థానంలో నిలిపి శెభాష్‌ అనిపించుకున్నారు. 2019 ఏప్రిల్‌లో జరిగిన నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నిక సందర్భంగా శరత్‌ నిర్వహించిన కీలక పాత్రకు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి లో ఇచ్చే బెస్ట్‌ ఎలక్ట్రోరల్‌ ప్రాక్టీస్‌ అవార్డును రాష్ట్రపతి అందజేశారు. గతేడాది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ నిర్వహించిన హూ ఈజ్‌ బెస్ట్‌ కలెక్టర్‌ అవార్డును జాతీయ స్థాయిలో శరత్‌ అందుకున్నారు. తాజా గా జరిగిన ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో శరత్‌ కా మారెడ్డి కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. సోమవారం రాత్రి జగిత్యాల కలెక్టర్‌ విధుల నుంచి రిలీవ్‌ అ య్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శరత్‌ మాట్లాడుతూ, మూడేళ్ల కాలంలో జిల్లా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా తనకు ప్రతి క్షణం సహకరించిందన్నారు. సమష్టి తత్వం తో ముందుకెళ్లడంతో జగిత్యాలలో ప్రభుత్వ పథకాలను అమలు చేశానన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 


logo