శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Feb 04, 2020 , 01:13:32

వెలువడిన సహకార ఎన్నికల నోటిఫికేషన్‌

వెలువడిన సహకార ఎన్నికల నోటిఫికేషన్‌

ధర్మపురి, నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. సోమవారం నోటిఫికేషన్‌ వెలువడ గా ఫిబ్రవరి 6 నుంచి 8వరకు నామినేషన్ల స్వీకరణ, 9న పరిశీలన, 10న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని అధికారులు తెలిపారు. 15న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం నుంచి ఒంటిగంట వరకు పోలింగ్‌, అదే రోజు ఓట్లను లెక్కించి, ఫలితాలు వెల్లడించనున్నారు. ధర్మపురి మండలం ధర్మపురి, జైన, తిమ్మాపూర్‌లో మూడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ధర్మపురిలో 13 నియోజకవర్గాలుండగా, తిమ్మాపూర్‌, జైన సొసైటీల పరిధిలో 12 నియోజకవర్గాలుండగా, రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. అలాగే సహకార సంఘాల పరిధిలోని రెవిన్యూ గ్రామాల్లో ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో సీఈఓలు ప్రదర్శించారు. ఈ నెల 6 నుంచి 8వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చనీ, నామినేషన్లు వేసే అభ్యర్థులతో పాటు ప్రతిపాదించే అభ్యర్థులు బకాయిలు ఉండరాదన్నారు. ధర్మపురి సహకార సంఘం పరిధిలో 16 గ్రామాలకు 13 నియోజకవర్గాలను కేటాయించారు. ఇందులో 2479 మంది ఓటర్లు ఉన్నారు. 1వ నియోజకవర్గ స్థానం ఓసీకి కేటాయించగా, రెండు ఎస్టీకి, మూడో స్థానం బీసీ, నాల్గు జనరల్‌, ఐదు స్థానం జనరల్‌, ఆరు స్థానం ఎస్సీ మహిళా, ఏడు ఓసీ, ఎనిమిది జనరల్‌, మహిళా, తొమ్మిది జనరల్‌, పది జనరల్‌, 11 బీసీ, 12 ఓసీ, 13వ స్థానం ఎస్సీకి కేటాయించారు. తిమ్మాపూర్‌ సం ఘంలో 12 నియోజకవర్గాల్లో 1, 2 4, 6, 10, 11, 12 డైరెక్టర్‌ స్థానాలు జనరల్‌కు, 8వ స్థానం జనరల్‌ మహిళకు, 3వ స్థానం ఎస్సీ మహిళ, 5 ఎస్సీ, 7, 9, బీసీలకు రిజర్వు చేశారు. జైనా సంఘం పరిధిలో 12 నియోజకవర్గాల్లో 1, 5, 6, 8, 10, 11 జనరల్‌కు, 2వ స్థానం ఎస్సీకి, 3వ స్థానం జనరల్‌ మహిళ, 4, 7ఎస్టీలకు, 9, 12 బీసీలకు కేటాయించారు. రిజర్వేషన్లతో పాటు ఓటరు జాబితాను సైతం అధికారులు ప్రకటించారు.

పెగడపల్లిలో మూడు సంఘాలకు..

పెగడపల్లిలో : మండలంలోని మూడు సహకార సం ఘాల ఎన్నికలకు అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేసి, రిజర్వేషన్లను ప్రకటించారు. పెగడపల్లి, నంచర్ల, నందగిరి సంఘాల్లో జరిగి ఎన్నికలకు తాసిల్దార్‌తో పాటు విం డోల సీఈఓలు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. పెగడపల్లి సం ఘంలో 13 డైరెక్టర్‌ స్థానాలుండగా, 1, 4, 5, 7, 8, 10, 13 డైరెక్టర్‌ స్థానాలు జనరల్‌కు, 9వ స్థానం జనరల్‌ మహి ళ, 6, 11 బీసీ జనరల్‌కు, 11 ఎస్సీ జనరల్‌కు, 3 ఎ స్సీ మహిళ, 2వ స్థానం ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. నం చర్ల సంఘం పరిధిలో 1, 5, 6, 8, 10, 11, 12 డైరెక్టర్‌ స్థానాలు జనరల్‌కు, 3వ స్థానం జనరల్‌ మహిళ, 4, 13 బీసీ జనరల్‌కు, 9 ఎస్సీ జనరల్‌కు, 7 ఎస్సీ మహిళ, 2 స్థానం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ అయ్యాయి. నందగిరి సహకార సంఘంలో 1, 3, 4, 6, 7, 8, 12 స్థానాలు జనరల్‌కు, 4వ స్థానం జనరల్‌ మహిళ, 2,10 బీసీ జనరల్‌కు, 6 ఎస్సీ జనరల్‌కు, 11 ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు.

గొల్లపల్లి  : మండలంలోని గొల్లపల్లి, చందోలి సహకార సంఘాల్లో ఎన్నికలకు అధికారులు మంగళవారం రిజర్వేషన్లను ప్రకటించారు. గొల్లపల్లి సంఘం పరిధిలో 1, 2, 3, 4, 7, 10, 11 జనరల్‌కు, 8 జనరల్‌ మహిళకు 5, 6 బీసీలకు, 9 ఎస్టీ, 12 ఎస్సీలకు, 12 ఎస్సీ మహిలకు రిజర్వేషన్లు కేటాయించారు. చందోలి సహకార  సంఘం పరిధిలో 1, 5, 6, 7, 8, 9, 11 స్థానాలు జనరల్‌కు, 2, 10 ఎస్సీలకు, 3,4 బీసీలకు, 12 జనరల్‌ మహిళకు,  13 ఎస్సీ మహిళ రిజర్వేషన్లు ఖరారు చేశారు.


logo