బుధవారం 01 ఏప్రిల్ 2020
Jagityal - Feb 04, 2020 , 01:08:50

సహకార ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే విజయం

సహకార ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే విజయం

మెట్‌పల్లి,నమస్తే తెలంగాణ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. సహకార సంఘాల ఎన్నికల నేపథ్యంలో సోమవారం పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో  ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, మెట్‌పల్లి మండలాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ క్రియాశీల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంచాయతీ, ప్రాదేశిక, మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు సహకార సంఘాల ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలన్నారు. ఇందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా అన్ని సంఘాల్లోనూ డైరెక్టర్ల నుంచి చైర్మన్‌ వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచేందుకు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకూ తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. అంతకుముందు గోదూర్‌ గ్రామానికి చెందిన పలువురు రైతు సంఘం నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సహకార సంఘాల అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులున్నారు.  

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌ 

కోరుట్లటౌన్‌: సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పథకం పేద ప్రజలకు వరమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని కల్లూరు రోడ్డు క్యాంపు కార్యాలయంలో సోమవారం పట్టణానికి చెందిన ఎండీ అష్ఫాక్‌కు వైద్య ఖర్చుల కోసం మంజూరైన రూ.2.50లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును మున్సిపల్‌ అధ్యక్షురాలు అన్నం లావణ్యతో కలిసి లబ్ధిదారుడికి అందజేశారు. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్య ఖర్చుల కోసం సాయమందిస్తున్నారని తెలిపారు. మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, తాసిల్దార్‌ సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, నాయకులున్నారు.   

మంచి సమాజం కోసం

బ్రహ్మకుమారీల కృషి అభినందనీయం

కోరుట్లటౌన్‌: విలువలతో కూడిన మంచి సమాజ నిర్మాణం కోసం బ్రహ్మకుమారీలు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లంగ దివ్య దర్శనం, సమైక్యత, సమాజంలో విలువలు అనే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంచి సమాజాన్ని స్థాపించాలన్న వారి ఆశయాన్ని స్వాగతించాలని కోరారు. అంతకుముందు ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధ్యక్షురాలు అన్నం లావణ్య, ఎంపీపీ తోట నారాయణ, ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్‌, రైతు జిల్లా సమన్వయ సమితి అధ్యక్షుడు చీటి వెంకటరావు, మాజీ ఏఎంసీ అధ్యక్షుడు సింగిరెడ్డి నారాయణరెడ్డి, రిటైర్డ్‌ ఏడీఏ రాజేశ్వర్‌, ఎంఏవోలు నాగమణి, యోగిత, ఎంఈవో నరేశం, బీకే రాజేశ్వరి, బీకే ప్రసన్న, బ్రహ్మకుమారీస్‌ తదితరులు పాల్గొన్నారు.     logo
>>>>>>