శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Feb 03, 2020 , 03:49:57

గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలి

గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలి
  • నందనవనాల్లా మారాలి
  • సారంగాపూర్‌, బీర్‌పూర్‌లో మండలాల్లో జీపీలకు ట్రాక్టర్ల పంపిణీ
  • ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌
  • ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి
  • గాంధీజీ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్‌ కృషి

సారంగాపూర్‌ : గ్రామాలు పచ్చదనంతో క ళకళలాడాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సం జయ్‌కుమార్‌ అన్నారు. సారంగాపూర్‌ మండ లం పెంబట్ల రాజన్న ఆలయ ఆవరణ, బీర్‌పూర్‌ మండల కేంద్రంలో పలు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. గాం ధీజీ అహింస ద్వారానే దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారనీ, సీఎం కేసీఆర్‌ సైతం అదే మార్గంలో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని గుర్తు చేశారు. గ్రామాల్లో పచ్చదనం వెల్లి విరియాలనీ, ప్రతి గ్రామం నందనవనంలా మా రాలన్నారు. రాష్ట్రంలోని గ్రామాలన్నీ అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం నెలనెలా రూ.339 కోట్లు పంచాయతీలకు విడుదల చేస్తుందన్నా రు. అలాగే పల్లెలు పరిశుభ్రంగా ఉండేలా, ప చ్చదనం వెల్లివిరిసేందుకు జీపీకి ట్రాక్టర్‌, ట్యాంకర్‌ అందిస్తున్నట్లు చెప్పారు. 


ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూ, ప చ్చదనం పెంపొందేలా తమవంతు కృషి చే యాలన్నారు. నియోజకవర్గంలోని మోతో, ధ రూర్‌, హస్నాబాద్‌ గ్రామాల్లో ఎంతో మార్పు తెస్తున్నారంటూ ప్రశంసించారు. గ్రామాల్లో ప్లాస్టిక్‌ నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. నాగులపేటను ఆదర్శంగా తీసుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. గ్రామా ల్లో దాతల సహకారంతో మొక్కలకు ట్రీగార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భం గా సారంగాపూర్‌, బట్టపల్లి, లచ్చనాయక్‌ తం డా, లక్ష్మీదేవిపల్లి, రంగపేట, నాగునూర్‌, ల చ్చక్కపేట, బీర్‌పూర్‌ మండలం తాళ్లధర్మారం, చర్లపల్లి, కండ్లపల్లి, రేకులపల్లి, కొల్వాయి, మంగెళ, కమ్మునూర్‌ జీపీలకు ట్రాక్టర్లను పం పిణీ చేశారు. ఆయా కార్యక్రామల్లో ఎంపీపీ కోల జమున, జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సొల్లు సురేందర్‌, కోఆప్షన్‌ సభ్యుడు అమీర్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ ము ప్పాల రాంచందర్‌రావు,  సాగి సత్యంరావు, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్లు కోల శ్రీనివాస్‌, మెరుగు రాజేశం, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు గుర్రాల రాజేందర్‌రెడ్డి, నారపాక రమేశ్‌, ప్రజాప్రతినిధులు గుర్రాల రాజేందర్‌రెడ్డి, అర్రె లక్ష్మి, అజ్మీర శ్రీలత, బెక్కం జ మున, మాలెపు విమల, జోగినపల్లి సుధాకర్‌రావు, ఏలేటి మమత, పాంపర్తి లక్ష్మి, వెంకటరమణ రావు, దమ్మ గం గు, మైపాల్‌ రెడ్డి, ప్ర భాకర్‌, రిక్కల ప్రభాకర్‌, గర్షకుర్తి శిల్ప, పర్వ తం రమేశ్‌, ఎలగందుల ల క్ష్మి, బందెల మరి య, చుంచు శారద, మెసు ఏసుదాసు, తోడేటి శేఖర్‌గౌడ్‌, బల్మూరి నారాయణరావు, గురునాథం మల్లారెడ్డి, ముక్క శంకర్‌, రవీందర్‌రావు, నాయకులు పాల్గొన్నారు.


సహకార ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి

సింగిల్‌ విండో ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ నాయకులు, కార్యక్తలకు సూచించారు. బీర్‌పూర్‌లో ఆదివారం టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న సింగిల్‌ విండో ఎన్నికల్లో మండలంలోని బీర్‌పూర్‌, కొల్వాయి సహకార సంఘాల్లో గులాబీ జెండా ఎగరవేయాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపేడుతున్న పలు అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. గ్రామా ల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీ బలోపేతానికి తమవంతు కృషిచేయాలన్నారు. గ్రా మాల అభివృద్దికి ఎల్లావేళలా అందుబాటులో ఉండి  తనవంతు కృషి చేస్తాన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు నారపాక ర మేశ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ ముప్పాల రాం చందర్‌ రావు, ప్రజాప్రతిధులు గర్షకుర్తి శిల్ప, రిక్కల ప్రభాకర్‌, గొర్ల సృజన, మేసు ఏసుదాసు, నల్ల మైపాల్‌ రెడ్డి, ఎలగందుల లక్ష్మి, బందెల మరియ, చుంచు శారద, పర్వతం రమేష్‌, ప్రభాకర్‌, నాయకులు ముక్క శంకర్‌, ముక్క వెంకటేష్‌ యాదవ్‌, రమేష్‌, జోగిన్‌పల్లి శ్రీనివాస్‌ రావు, గర్షకుర్తి రమేష్‌, రామకిష్టు గంగాధర్‌, సతీష్‌, రాము, మహేంధర్‌, గంగాధర్‌, నరేంధర్‌, అశోక్‌, మల్లేశం, రాజేశం, సంపత్‌, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


logo