బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Feb 02, 2020 , 01:19:35

‘పల్లె ప్రగతి’ నిరంతరం

‘పల్లె ప్రగతి’ నిరంతరం
  • కార్యక్రమాలను కొనసాగించాలి
  • వీసీలో కలెక్టర్‌ శరత్‌
  • ఎక్కడైనా భూ సమస్యలుంటే తాసిల్దార్ల దృష్టికి తీసుకెళ్లాలి
  • అధికారులు సమష్టి కృషితో పురోగతి సాధించాలి
  • అన్ని పనులూ పూర్తి చేయాలి

జగిత్యాల, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శనివారం పల్లెప్రగతి పనుల పురోగతిపై కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమం అమలు కోసం అధికారులు సమష్టి కృషి తో పనుల్లో పురోగతి సాధించాలన్నారు. గ్రామా ల్లో పనులను పూర్తి చేసుకుని, పూర్తయిన పనుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. డంప్‌యార్డు, కంపోస్టు పిట్‌, వైకుంఠధామం, నర్సరీ పనులను ప్రారంభించుకోవాలని, ఎక్కడైనా భూసమస్యలున్నట్లయితే తాసిల్దార్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటడమే కాకుండా వాటికి పాదులు, ట్రీగార్డులు, కంపను ఏర్పాటు చేయాలన్నారు. 


మంకీఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేసి వందశాతం పనులను పూర్తి చేయడంలో డివిజనల్‌ పం చాయతీ అధికారులు, ఎంపీడీవో, ఏపీఎం, గ్రామ కార్యదర్శి, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సర్పంచులు బాధ్యత వహించాలన్నారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్రామాల్లో ట్రాక్ట ర్లు, ట్యాంకర్లు, ట్రాలీలను పంపిణీ చేయాలని, ఇందులో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ సహకారం ఉం డాలన్నారు. వారు సహకరించని పక్షంలో వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో దాత ద్వారా శవాలను భద్రపరిచే ఫ్రీజర్లు, దోమలను పారదోలే ఫాగింగ్‌ మిషన్‌, వైట్‌వాష్‌లను వేయించాలన్నారు. దాతల వివరాలను గ్రామపంచాయతీలో రాయించి వారిని తగిన విధంగా సత్కరించాలన్నారు. పనుల పర్యవేక్షణపై ఆకస్మిక తనిఖీ లు చేపడతామని, అధికారులు పనులను నిబద్ధతతో చేయాలన్నారు. జిల్లా పరిషత్‌ సీఈవో శ్రీనివాస్‌, డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీనారాయణ, జిల్లా పం చాయతీ అధికారి శేఖర్‌, డివిజనల్‌ పంచాయతీ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 


కలెక్టర్‌కు పుస్తకం అందజేత

పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా కొడిమ్యా ల మండలం హిమ్మత్‌రావుపేట గ్రామంలో చేపట్టిన పనుల వివరాలతో ముద్రించిన పుస్తకాన్ని కలెక్టర్‌ శరత్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో హిమ్మత్‌రావుపేట సర్పంచ్‌ పునుగోటి కృష్ణారావు, పంచాయతీ కార్యదర్శి పావని తదితరులున్నారు.


logo