గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Feb 02, 2020 , 01:16:57

కిక్కిరిసిన కొండగట్టు

కిక్కిరిసిన కొండగట్టు
  • సమక్క జాతర నేపథ్యంలో అంజన్న సన్నిధికి తాకిడి
  • ఆలయానికి రూ.5లక్షల ఆదాయం
  • ఇబ్బందులు కలగకుండా అధికారుల ఏర్పాట్లు
  • స్వామివారిని దర్శించుకున్నసుమారు 30వేల మంది

మల్యాల : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొం డగట్టు ఆంజనేయ స్వామి ఆలయం సమ్మక్క సా రలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో శనివా రం భక్తుల రద్దీతో కిక్కిరిసింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో సు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శుక్రవా రం రాత్రి నుంచి కొండగట్టు ఆలయ పరిసరాల్లో బస చేసి శనివారం వేకువజామున ఆలయ కోనేరులో పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్‌ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉం డేందుకు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు క్యూలైన్లను పర్యవేక్షించారు. భక్తులు ప్రధాన ఆలయంలో ఆంజనేయ స్వామి వారితో పాటు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారు, అ నుబంధ ఆలయాలైన బేతాళ స్వామి, కోదండ రా మాలయం, కొండలరాయుని అడుగులు, మునిగుహలు, బొజ్జపోతన తదితర ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 


భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాచుపెల్లి జేఎన్టీయూ కళాశాలకు చెందిన 30 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు సేవలందించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆర్జిత సేవలతో పాటు అ భిషేకాలు, అష్టోత్తర శతనామావళి పూజలు, సా మూహిక సత్యనారాయణ వ్రతాలు,, అంతరాలయ దర్శనాలను రద్దు చేయడంతో పాటు వాహ న పూజలు మధ్యాహ్నం 2గంటల తర్వాత ప్రారంభించారు. శనివారం స్వామి వారిని సుమారు 30 వేల మంది పైచిలుకు భక్తులు దర్శించుకోగా ఆలయానికి రూ.5లక్షల వరకు ఆదాయం సమకూరనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కా ర్యక్రమంలో ఏఈవో బుద్ది శ్రీనివాస్‌, ఆలయ సూపరింటెండెంట్లు వైరాగ్యం అంజయ్య, శ్రీనివా స్‌ శర్మ, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రాజేశ్వర్‌ రావు, సంప త్‌, ఆలయ సిబ్బంది కాసర్ల శ్రీనివాస్‌, సునిల్‌, లక్ష్మారెడ్డి, రాజేందర్‌ రెడ్డి, రమేశ్‌, రవి, వెంకటేశ్‌, పోలీస్‌ సెక్యూరిటీ సిబ్బంది ఇన్‌చార్జి సముద్రాల రాంచంద్రం, తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>