ఆదివారం 29 మార్చి 2020
Jagityal - Feb 02, 2020 , 01:16:20

సొసైటీల ద్వారా పంటలు విక్రయించుకోవాలి

సొసైటీల ద్వారా పంటలు విక్రయించుకోవాలి

కోరుట్ల:  రైతులు సొసైటీలు ఏర్పాటు చేసుకొని తాము పండించిన పంటలు నేరుగా విక్రయిస్తే అధిక లాభాలు పొందవచ్చునని పట్టుపరిశ్రమ, ఉద్యానవన అధికారి శ్యాంప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం మండలంలోని నాగులపేట గ్రామంలో రైతులకు సొసైటీ ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రైతులు 10 మంది నుంచి 300మంది వరకు సొసైటీ ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. సొసైటీ ద్వారా వరి, మామిడి, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లను విక్రయించి లాభాలను పొందవచ్చునన్నారు. నాబార్డు నుంచి సొసైటీలకు ఆర్థికసాయం అందుతుందన్నారు. రైతులు అడిగిన పలు సందేహాలకు ఆయన సమాధానాలిచ్చారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు చీటి వెంకట్రావ్‌, సర్పంచ్‌ చెప్యాల నర్సయ్య, రైతులు చిట్టిరెడ్డి నారాయణరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, బుచ్చిరాజం, కమలాకర్‌రెడ్డి, ఉద్యానవన అధికారి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo