మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Feb 02, 2020 , 01:15:47

నర్సన్న సన్నిధిలో భక్తుల రద్దీ

నర్సన్న సన్నిధిలో భక్తుల రద్దీ

ధర్మపురి,నమస్తేతెలంగాణ: ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో శనివారం రథసప్తమి సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాం తాల నుంచి వచ్చిన భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలాచరించారు. అనంతరం సంకల్పాది పూ జలు చేశారు. పితృదేవతలకు తర్పణాలు వదిలా రు. ప్రధాన దేవాలయమైన శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయా ల్లో క్యూలైన్ల ద్వారా స్వామివారలను దర్శించుకొని పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సిబ్బంది తగు ఏర్పా ట్లు చేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్‌ ఏర్పాట్లను పరిశీలించారు.


ఘనంగా రథసప్తమి

ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవాయంలో శనివారం రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథసప్తమి పర్వదినాన్ని సూర్య భగవానుడు ఆవిర్భంచిన రోజుగా చెబుతారు. అలాగే సూర్య భగవానుడి ఆంతర్యామిగా ఉండే శ్రీమన్నారాయుణుని సన్నిధి అష్టలక్ష్మి దేవాలయంగా చెబుతారు. రథసప్తమి సందర్భంగా శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


logo
>>>>>>