సోమవారం 30 మార్చి 2020
Jagityal - Feb 02, 2020 , 01:15:09

వీవోఏలను గుర్తించిన ఘనత కేసీఆర్‌దే

వీవోఏలను గుర్తించిన ఘనత కేసీఆర్‌దే

జగిత్యాల టౌన్‌: వీవోఏలను గుర్తించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని వాసవీ గార్డెన్స్‌లో తెలంగాణ వీవోఏ ఉద్యోగుల సంఘం ఏడో ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి, యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎల్‌.రూప్‌సింగ్‌, యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.కోటేశ్వర్‌, రాష్ట్ర కార్యదర్శి ఎం.మాధవిలతో కలిసి జెండా ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలన్నీ కింది స్థాయిలోకి తీసుకెళ్లడానికి వీవోఏలు ముఖ్యపాత్ర పోషించారన్నారు. వీవోఏలకు పనికి తగిన వేతనం అందించాలన్న విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. యూనియన్‌ గౌరవాధ్యక్షుడు ఎల్‌.రూప్‌సింగ్‌ మాట్లాడుతూ.. వీవోఏలకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం, ఫొటో గుర్తింపు కార్డులను సంబంధిత మంత్రితో సీఎం ద్వారా ఇప్పిస్తానన్నారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర కోశాధికారి తిరుపతి, రాష్ట్ర నాయకుడు నారాయణ, జిల్లా అధ్యక్షురాలు సరిత, ప్రధాన కార్యదర్శి జలజ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పరశురామ్‌, రమేశ్‌, పద్మావతి, భిక్షపతి, వెంకటేశం రాజు, రాజ్‌కుమార్‌, మచ్చేందర్‌, ఆంజనేయులు, నెహ్రూనాయక్‌, ప్రభాకర్‌, యాగస్వామి తదితరులు పాల్గొన్నారు. 


logo