మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Feb 01, 2020 , 04:30:44

ఉత్సాహంగా ఫ్రెండ్లీ మ్యాచ్‌

ఉత్సాహంగా ఫ్రెండ్లీ మ్యాచ్‌
  • పోలీసులు, పాత్రికేయులకు క్రికెట్‌ పోటీ
  • విజేతగా నిలిచిన పోలీస్‌ జట్టు
  • ప్రారంభించిన ఎస్పీ సింధూశర్మజగిత్యాల క్రైం: జిల్లా పోలీస్‌ టీం వర్సెస్‌ ప్రెస్‌ టీం మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ ఉత్సాహంగా సాగింది. జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం మైదానంలో శుక్రవారం పోలీస్‌, ప్రెస్‌ జట్ల ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌ను జిల్లా ఎస్పీ సింధూశర్మ ప్రారంభించారు. అదనపు ఎస్పీ దక్షిణామూర్తి టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన జిల్లా పోలీస్‌ జట్టు మొదట బ్యాటింగ్‌ చేసింది. పోలీస్‌ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 114 పరుగులు సాధించింది.  అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన ప్రెస్‌ జట్టు ఆరంభంలో త్వరగా మూడు వికెట్లు చేజార్చుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ‘నమస్తే తెలంగాణ’ స్టాఫ్‌ రిపోర్టర్‌ కొత్తూరి మహేశ్‌కుమార్‌ చెలరేగి 40 పరుగులు సాధించారు. ప్రెస్‌ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 71 పరుగులే చేయగా, పోలీస్‌ జట్టు  విజయం సాధించింది. అనంతరం విజేతలకు ఎస్పీ బహుమతులు ప్రదానం చేశారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా పోలీస్‌ జట్టు నుంచి వెంకటేశ్‌ నిలవగా, ట్రోఫీ అందుకున్నారు.


 అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రెస్‌, పోలీసుల మధ్య మంచి కో ఆర్డినేషన్‌ ఉండాలనే ఉద్దేశంతో ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించామన్నారు.  డీఎస్పీలు వెంకటరమణ, ప్రతాప్‌, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జే సురేందర్‌కుమార్‌, బండ స్వామి, జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు కుర్మాచలం శ్రీనివాస్‌, కొత్తూరి మహేశ్‌కుమార్‌, వెంకటేశ్‌, ఆదిల్‌, జహీర్‌, సీఐలు జయేశ్‌రెడ్డి, రాజేశ్‌, కిశోర్‌, లక్ష్మీబాబు, ఆర్‌ఐ నవీన్‌, ఎస్‌ఐలు, పాత్రికేయులు, పోలీస్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రెస్‌ టీం కెప్టెన్‌ జహీర్‌ చాతి నొప్పితో విలవిల్లాడగా, స్పందించిన పాత్రికేయులు, పోలీసులు పోలీస్‌ వాహనంలో జిల్లా దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం జహీర్‌ను కరీంనగర్‌ దవాఖానకు తరలించారు. 


logo
>>>>>>