సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Feb 01, 2020 , 04:39:05

ధర్మపురి అభివృద్ధికి కృషి

ధర్మపురి అభివృద్ధికి కృషి
  • మంత్రిమంత్రి ఈశ్వర్‌ సహకారంతో సమస్యలు పరిష్కరిస్తా ఈశ్వర్‌ సహకారంతో సమస్యలు పరిష్కరిస్తా
  • బల్దియా అధ్యక్షురాలు సంగి సత్యమ్మ

ధర్మపురి,నమస్తేతెలంగాణ : ధర్మపురి పట్టణంలో శుక్రవారం రాత్రి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ చేశారు. దుర్గాకాలనీ, గిరుకల కాలనీ, హనుమాన్‌ వాడల్లో ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దు ర్గాకాలనీలో ఇతర రాష్ర్టాలు, ప్రాంతాల నుంచి వచ్చి నివాసముంటున్నారనే సమాచారంతో కాలనీలో ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా సోదా చేశారు. సరైన పత్రాలు లేని 25 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణకే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించి పట్టణాల్లో, పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామన్నా రు. ప్రజలు అప్రమత్తంగా ఉండి నేరాల నియంత్రణకు సహకరించాలని కోరారు. అవసరమైతే డ్రోన్‌ కెమారాలతో అక్రమార్కుల కదలికలపై నిఘా ఉంచుతామన్నారు. ధర్మపురి పుణ్యక్షేత్రం గా విరాజిల్లుతున్నందున కొత్త వ్యక్తులు భక్తుల ముసుగులో ఇక్కడికి వచ్చే ప్రమాదముందనీ, కొత్త వ్యక్తులుగానీ, అనుమానాస్పద వ్యక్తులు గానీ కనిపిస్తే వెంటనే 100కు కాల్‌ చేయాలని కోరారు. కార్డన్‌సెర్చ్‌లో అడిషనల్‌ ఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీ వెంకటరమణ, ధర్మపురి, జగిత్యాల రూరల్‌ సీఐలు లక్ష్మీబాబు, రాజేశ్‌, ఎస్‌ఐలు శ్రీకాంత్‌, నవత, శ్రీనివాస్‌, ఆరోగ్యం, సిబ్బంది పాల్గొన్నారు.  


logo