గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Jan 31, 2020 , 00:45:52

అందరి సహకారంతో ముందుకు

అందరి సహకారంతో ముందుకు
  • రాయికల్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా
  • బల్దియా చైర్మన్‌ బాధ్యతల స్వీకరణ
  • మున్సిపల్‌ అధ్యక్షుడు మోర హనుమాండ్లు
  • వీధిదీపాలు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిరాయికల్‌ రూరల్‌ : అన్ని సామాజిక వర్గాలు, మున్సిపల్‌ పాలక వర్గం సభ్యుల సమష్టి కృషితో రాయికల్‌ మున్సిపాలిటీని అభివృద్ది చేస్తానని చైర్మన్‌ మోర హన్మండ్లు పేర్కొన్నారు. రాయికల్‌ మున్సిపాలిటీ చైర్మన్‌గా మోర హన్మండ్లు గురువా రం బాధ్యతలు స్వీకరించారు. రాయికల్‌ మున్సిపల్‌ కార్యాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా కౌన్సిలర్ల సమక్షంలో హన్మండ్లు మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయికల్‌ పట్టణ అభివృద్ధ్దిలో ఎలాంటి లోటు పాట్లు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు. వీధి దీపాలు, మురుగ కాలువలు, పరిశుభ్రతపై పత్యేక దృష్టి సారిస్తానన్నారు. పట్టణంలోని రహదారులను మెరుగు పర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లను రాయికల్‌ పద్మశాలీ యువజన సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కా ర్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ గండ్ర రమాదేవి, కన్నాక మ హేంద ర్‌, మారంపెల్లి సాయి కుమార్‌, తురగ శ్రీధర్‌ రెడ్డి, విఎమ్‌ గౌ డ్‌, షాఖీర్‌, ఎలిగేటి దివ్య, ధర్మపురి, శ్రీరాముల స త్యనారాయణ, మ్యాకల కాం తారావు, మ్యాకల అనురాధ, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


సంక్షేమ శాఖ మంత్రిని కలిసిన కౌన్సిలర్లు

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను జగిత్యాలలో రాయికల్‌ మున్సిపాలిటీ కౌన్సిలర్లు గురువారం కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. రాయికల్‌ మున్సిపాలిటీలో చైర్మన్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరం టీఆర్‌ఎస్‌ కౌన్సిల ర్లు నేరుగా జగిత్యాలకు వెళ్లి మంత్రితో పాటు జడ్పీ చైర్మన్‌ దావ వసంతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ అందరి సహకారంతో పట్టణాన్ని అభివృద్ది చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాయికల్‌ ఎంపీపీ లావుడ్య సంధ్య సురేందర్‌ నాయక్‌, జడ్పీటీసీ జాదవ్‌ అశ్విని టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


logo