ఆదివారం 29 మార్చి 2020
Jagityal - Jan 31, 2020 , 00:39:50

కుష్ఠు నిర్మూలన అందరి బాధ్యత

కుష్ఠు నిర్మూలన అందరి బాధ్యత

జగిత్యాల అర్బన్‌ :  కుష్ఠు వ్యాధి నిర్మూలన అందరి బాధ్యత అని, దీనికి ప్రజలందరూ సహకరించాలని జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్‌ కోరారు. గురువారం మహత్మా గాంధీ వర్దంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని మోతెవాడ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో కుష్టు వ్యాధి నిర్మూలన పక్షోత్సవాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుష్టు వ్యాధి ఒక సాధారణ వ్యాధి అని, మైక్రో బ్యాక్టీరియా లెప్రె అనే సూక్ష్మ క్రిమి ద్వారా ఈ వ్యాధి సోకుతుందని, ఈ వ్యాధికి చికిత్స సర్కారు దవాఖానలు, ఆరోగ్య కేం ద్రాల్లో ఉచితంగా లభిస్తుందన్నారు. జగిత్యాల జిల్లాను కుష్ఠు  రహిత జిల్లాగా మార్చుకుందామన్నారు. 


అనంతరం జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇది అతి సామాన్యమైన వ్యాధి అని, ఇది ము ఖ్యంగా చర్మానికి, నరాలకు సోకుతుందని తెలిపారు. ఇది బహిర్గతం కావడానికి మూడు నెలల నుంచి దాదాపు 30సంవత్సరాలు పడుతుందని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాలు జిల్లా అంతటా 15 రోజుల పాటు జరుగుతాయని, దీనికి ప్రజలందరు స హకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ ఎండీ సమియొద్దీన్‌, డాక్టర్‌ శ్రీపతి, జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్‌ రెడ్డి, వైద్యులు డాక్టర్‌ సతీష్‌, శ్వేత రాణి, పీఎంవో రూప, డీపీఎంవోలు, డీవీ వో రాజేందర్‌, డెమో తులసి రమణ, అర్బన్‌ హెల్త్‌ సెం టర్ల కమ్యూనిటీ ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు. 


logo