గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Jan 31, 2020 , 00:39:08

సాగుపై గిరిజన రైతులకు శిక్షణ

సాగుపై గిరిజన రైతులకు శిక్షణ

జగిత్యాల టౌన్‌ : పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో గురువారం గిరిజన ఉప ప్రణాళిక 2019-20 పథకంలో భాగంగా గిరిజన రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ కళాశాల డీన్‌ డాక్టర్‌ సునీతాదేవి సారంగాపూర్‌ మండలం మంగేళ, తుంగూరు గ్రామాల్లోన్ని ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్న కారు రైతులకు నువ్వుల విత్తనంతో పాటు కొన్ని వ్యవసాయ ఉత్పాదకాలను అందించారు. ఈ సందర్భంగా  నూనెగింజల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ దుర్గారాణి గిరిజన మహిళా రైతులనుద్దేశించి మాట్లాడుతూ నూనెగింజల పంటల సాగు, నూనెగింజ పంటల ఆవశ్యకత గూర్చి విపులంగా వివరించారు. శాస్త్రవేత్త డాక్టర్‌ డి.పద్మజ నువ్వుల విత్తనోత్పత్తి, ఆవాల సాగు గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పి.మధుకర్‌, బోధన, బోధనేతర సిబ్బంది, మంగేళ, తుంగూరు గ్రామాల గిరిజన రైతులు పాల్గొన్నారు. logo