బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Jan 31, 2020 , 00:32:50

యువత లక్ష్య సాధనకు కృషి చేయాలి

యువత లక్ష్య సాధనకు కృషి చేయాలి

జగిత్యాల లీగల్‌ : యువత తాము ఎంచుకున్న లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాలని మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం క్లస్టర్‌ స్థాయి యువ తరంగం 2019-20 సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పోటీల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి మాట్లాడుతూ యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధనకు నిరంతరం కృషి చేయాలన్నారు. 


యువత సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో మానసిక వికాసం పెంపొందుతుందన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి వచ్చేందుకు దగ్గరి దారులు ఏవీ ఉండవనీ, కృషి, పట్టుదలతో విజేతగా నిలువవచ్చన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టు కున్నాయి. కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా డి గ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌కేఎన్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అశోక్‌, యువ తరంగం క్లస్టర్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌, పోటీల కోఆర్డినేటర్‌ కె కిరణ్మయి, స్టాఫ్‌క్లబ్‌ సెక్రెటరీ సత్యప్రకాశ్‌, అధ్యాపకులు సాయిమధుకర్‌, తిరుపతి, మధుకర్‌ రావు, రహీం, జ్యోత్స్న, సంధ్యారాణి, కళ్యాణలక్ష్మి, ప్రిన్సిపాల్‌ మసురూర్‌ సుల్తానా, సునిత, శంకరయ్య, జమున, తదితరులు పాల్గొన్నారు. 


logo