మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Jan 30, 2020 , 04:02:58

కష్టపడి పనిచేయండి

కష్టపడి పనిచేయండి
  • పట్టణాలను అభివృద్ధి చేసుకోండి
  • సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మున్సిపల్‌ పాలకవర్గాలదే
  • రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు
  • తెలంగాణ భవన్‌లో రామన్నను కలిసిన బల్దియా అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కార్పొరేటర్లు

జగిత్యాల/మెట్‌పల్లి,నమస్తే తెలంగాణ/జగిత్యాల రూరల్‌/రాయికల్‌: ‘కొత్తగా ఎన్నికైన మున్సిపల్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కౌన్సిలర్లు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండండి.. కష్టపడి పనిచేసి పట్టణాలను సమష్టిగా అభివృద్ధి చేసుకోండి.. బల్దియాలను సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పాలకవర్గాలదే”నంటూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. జిల్లాలో కొత్తగా ఎన్నికైన మున్సిపల్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కౌన్సిలర్లు, ఇతర ముఖ్యనేతలు మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌ను బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.  పుష్పగుచ్ఛాలు అందించి కృతజ్ఞతలు తెలి పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అఖండ విజయంపై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద ర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ     మున్సి పాలిటీల అభివృద్ధికి తగిన నిధులు కేటాయి స్తామని, పట్టణాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తూ వారి మన్ననలు పొందాలని పేర్కొ న్నారు. 


కేటీఆర్‌ను కలిసినవారిలో జగిత్యాల నుంచి  మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి,  ఉపాధ్యక్షుడు గోలి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు తోట మల్లికార్జున్‌, సిరికొండ పద్మ, అడువాల జ్యోతి, బొడ్ల జగదీశ్‌, వొద్ది లత, జుంబర్తి రాజ్‌కుమార్‌, కూసరి అనిల్‌, పంబాల రాము, అల్లె సాగర్‌, భా రతి, కోరె గంగమల్లు, బాలె లత, చుక్క నవీన్‌, అ రుముళ్ల నర్సమ్మ, మేకల పద్మావతి, కూసరి అని ల్‌, నాయకులు కూతురు శేఖర్‌, బాలె శంకర్‌, అ డువాల లక్ష్మణ్‌, సిరికొండ సింగారావు, వొద్ది రాం మోహన్‌ ఉన్నారు.  అనంతరం మంత్రి ఈశ్వర్‌ను సైతం బోగ శ్రావణి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించగా పాలకవర్గాన్ని మంత్రి అభినందించారు. మెట్‌పల్లి నుంచి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైన బోయినపల్లి చంద్రశే ఖర్‌రావు సైతం స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి మంత్రి కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రజజాకాంక్షకు అనుగుణంగా  పట్టణాభివృద్ధి కోసం కృషి చేయా లని మంత్రి సూచించినట్లు చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. రాయికల్‌ నుంచి  మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, ఉపాధ్యక్షురాలు గండ్ర రమాదేవి, కౌన్సిలర్లు మహేందర్‌, సాయికుమార్‌, మహేశ్‌, సువర్ణ ఎమ్మెల్యే సంజయ్‌ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం ప్రజలకు మెరుగైన పాలన అందించాలని మంత్రి సూచించినట్లు తెలిపారు. ధర్మపురి నుంచి మున్సిపల్‌ అధ్యక్షురాలు సంగి సత్తెమ్మ, ఉపాధ్యక్షుడు ఇందారపు రామయ్య, ఆలయ పాలకవర్గ మాజీ అధ్యక్షుడు ఎల్లాల శ్రీ కాంత్‌రెడ్డి తదితరులు మంత్రి ఈశ్వర్‌ ఆధ్వ ర్యంలో రామన్నను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. 


‘కలిసికట్టుగా పనిచేశారు’

జగిత్యాల నియోజకవర్గంలోని రెండు మున్సిపాలి టీల్లో టీఆర్‌ఎస్‌ విజయం కోసం ప్రతి నాయకు డు, కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి పార్టీకి విజ యం చేకూర్చారని మంత్రి కేటీఆర్‌ కితాబు నిచ్చారు. పార్టీ విజయం సాధించేందుకు కృషి చేసిన నాయకులను పార్టీ మరువదన్నారు. మం త్రిని కలిసిన వారిలోజగిత్యాల జిల్లా గౌడ సం ఘం అధ్యక్షుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌ గౌడ్‌ తదితరులున్నారు. 


logo
>>>>>>