సోమవారం 30 మార్చి 2020
Jagityal - Jan 29, 2020 , 04:10:54

లక్ష ఎకరాలకు నీరందిస్తాం

లక్ష ఎకరాలకు నీరందిస్తాం

కథలాపూర్‌ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేములవాడ నియోజకవర్గం లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు స్పష్టం చేశారు. మంగళవారం కథలాపూర్‌ మండలంలో పలు అభివృద్ధి పనులకు జగిత్యాల జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. గంభీర్‌పూర్‌ సింగిల్‌విండో ఆధ్వర్యంలో సుమారు 30లక్షలతో బొమ్మెన విండో గోదాం, గంభీర్‌పూర్‌ విండో భవనం, గోదాంను ప్రారంభించారు. అనంతరం అనంతరం మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన సబ్సిడీ రుణాలు రూ.లక్ష చెక్కులను 12 మందికి లబ్ధిదారులకు అందించారు. అలాగే బొమ్మెనలో పెద్దమ్మ ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ బొమ్మెన శివారులో సమ్మక్క సారాలమ్మ వద్ద కొబ్బరికాయలు కొట్టి, పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే 60వేల ఎకరాలకు నీరందించామనీ, వరద కాలువ నుంచి లిఫ్ట్‌ ఏర్పాటు చేసి మరో 46వేల ఎకరాలకు త్వరలో నీళ్లు అందిస్తామనీ, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. వరద కాలువకు 19లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లోని చెరువులకు నీళ్లందించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రెండు నెలల్లో మేడిపల్లి మండల శివారులోని సూరంపేట నుంచి గంభీర్‌పూర్‌కు నీళ్లు వచ్చేలా ఏర్పాటు చేస్తామన్నారు. గంభీర్‌పూర్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు సహకారం అందిస్తానన్నారు. అలాగే గ్రామానికి అదనంగా 15డబూల్‌ బెడ్రూం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ఆర్టికల్చర్‌ యూనివర్సిటీ కి ప్రదిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రాథమిక పాఠశాల తరగతి గదుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తానన్నారు. 

రైతుల సంక్షేమానికి కృషి : జడ్పీ అధ్యక్షురాలు

జగిత్యాల జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలను అమ్ముకునేందుకు వీలుగా మార్కెట్‌ వసతి కల్పిస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరువయ్యాయన్నారు. దీంతో ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తే సీఎం కేసీఆర్‌ అనీ, దీంతో వారి సంక్షేమానికి ఎన్నో అమలు చేస్తూ ఆయా కుటుంబాల్లో సంతోషం నింపుతున్నారన్నారు. కార్యక్రమంలో కేడీసీసీబీ వైస్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ కొడిపల్లి గోపాల్‌రెడ్డి, ఎంపీపీ జవ్వాజి రేవతి, జడ్పీటీసీ నాగం భూమయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ దాసరి గంగాధర్‌, సర్పంచులు పోతు సింధూజ, పిడుగు లావణ్య, ఎంపీడీఓ జనార్దన్‌, సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌ అల్లూరి బాపురెడ్డి, సీఈఓ నీలి శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ గండ్ర కిరణ్‌రావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కల్లెడ శంకర్‌, నాయకులు, ప్రజాప్రతినిధులు పొలాస నరేందర్‌, వర్ధినేని నాగేశ్వర్‌రావు, చీటి విద్యాసాగర్‌రావు, గడ్డం భూమరెడ్డి, గడిల గంగప్రసాద్‌, ఎంజీ రెడ్డి, పిడుగు తిరుపతిరెడ్డి, అనంతరెడ్డి, జవ్వాజి గణేశ్‌, శీలం మోహన్‌రెడ్డి, మల్యాల రమేశ్‌, కొండ ఆంజనేయులు, నాంపెల్లి లింబాద్రి, గుండారపు గంగాధర్‌, నస్కూరి భాస్కర్‌, ఏజీబీ మహేందర్‌, చుక్క దేవారాజం, రైతులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.


logo