గురువారం 09 ఏప్రిల్ 2020
Jagityal - Jan 29, 2020 , 04:08:42

‘ప్రగతి’ పనులు వెంటనే పూర్తిచేయాలి

‘ప్రగతి’ పనులు వెంటనే పూర్తిచేయాలి

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పల్లె ప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శరత్‌ ఆదేశించారు. జిల్లాలో పల్లె ప్రగతిపై జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో మంగళవారం మం డలాల వారీగా, సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ శరత్‌ మాట్లాడుతూ పల్లె ప్రగతిలో చేపట్టిన డంపింగ్‌ యార్డు, వైకుంఠధామం, కంపోస్టు షెడ్‌, ట్రాక్టర్ల కొనుగోలు, రోడ్‌సైడ్‌ ప్లాంటేషన్‌, న ర్సరీ, మంకీఫుడ్‌ కోర్టులపై మండలాల వారీగా అ డిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్ల కొనుగోలు విషయమంలో ఆలస్యం ఎక్కడ జరుగుతుందని, బ్యాం కు, ట్రాక్టర్‌ ఎజెన్సీలు, ట్రెజరీ అధికారులతో మా ట్లాడాలని సూచించారు. ఎక్కడ ఏ విధమైన గ్యా ప్‌ లేకుండా పూర్తి చేయాలని, మండల పంచాయ తీ అధికారులను ఆదేశించారు. వైకుంఠధామాల కు జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో గ్రామాల వారీగా రెవెన్యూ శాఖతో స్థలాలను కేటాయించామని, వాటిలో వెంటనే పనులు ప్రారంభించాలని ఈఈపీఆర్‌ను ఆదేశించారు. ఈ పనులు 48 గం టల్లో ప్రారంభించాలని, గ్రామాల్లో ప్రభుత్వ స్థ లం లేని దగ్గర విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో ఖాళీగా ఉం డే స్థలాలను, ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఎక్కువ స్థలం ఉంటే దాతల ద్వారా సేకరించాలని లేదంటే గ్రామ పంచాయతీ తీర్మానం చేసి గ్రామ పంచాయతీ నుంచి కొనుగోలు చేయాలన్నారు.   కోర్టు కూడా గ్రామ పంచాయతీలు చూడాలని, గ్రామం ప్రారంభం నుండి చివరి వరకు రోడ్లకు ఇరువైపులా మొక్కలు, మంకీఫుడ్‌ కోర్టు బాధ్యత పంచాయతీదేనన్నారు. సరిగాలేని గ్రామపంచాయతీల్లోని కార్యదర్శులకు మెమోలు జారీ చేయాలని, అదే విధంగా సర్పంచులకు నోటీసులు ఇవ్వాలని మండల పంచాయ తీ అధికారులను సూచించారు. ఈ నెల చివరి వరకు అన్ని పనులు సక్రమంగా చూసుకోవాలని, ఫిబ్రవరి 1 నుంచి తనిఖీ చేస్తానన్నారు. 46 చిన్న గ్రామ పంచాయతీల ట్రాక్టర్ల కొనుగోలుకు సం బంధించిన డాక్యుమెంట్స్‌ పూర్తిచేయాలన్నారు. రోడ్‌ సైడ్‌ ప్లాంటేషన్‌ గ్రామం రోడ్డు ప్రారంభం నుండి చివరి వరకు ఎలాంటి గ్యాప్‌ లేకుండా బా గున్నట్లు ఎంపీడీఓ ధ్రువీకరణ చేయాలన్నారు. ధ్రువీకరణ చేసిన తర్వాత సరిగా లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జేసీ బీ రాజేశం, మెట్‌పల్లి సబ్‌కలెక్టర్‌ గౌతం పోట్రూ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌, ఆర్డీఓ నరేందర్‌, డీఆర్డీ పీడీ లక్ష్మీనారాయణ, డీపీఓ శేఖర్‌, డీ ఎఫ్‌ఓ నర్సింగరావు, బ్యాంకర్స్‌, తాసిల్దార్లు, ఎం పీడీఓలు, ఎంపీడీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. 

నులిపురుగు నిర్మూలన దినోత్సవాన్ని 

విజయవంతం చేయాలి

జాతీయ నులిపురుగు నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ శరత్‌ పిలుపుని చ్చారు. జాతీయ నులిపురుగు నిర్మూలన దినోత్సవంపై మంగళవారం సంబంధిత అధికారులతో కలెక్టర్‌ శరత్‌ తన చాంబర్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నులిపురుగు నిర్మూలన దినోత్సవాని ఫిబ్రవరి 10వ తేదీ న నిర్వహిస్తారన్నారు. ఆ రోజు ను లిపురుగుల మందులు వేస్తారని, అందుబాటులో లేని వారికి ఫిబ్రవరి 17వ తేదీన అందజేస్తారన్నారు. ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరముల వయస్సు గల ప్రతి వారికి నులిపురుగుల మాత్రలు వాడాలన్నారు. ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వయస్సు గల చిన్న పిల్లలకు అరటాబ్లెట్‌ చూర చేసి తాగించాలన్నారు. 4 ఏళ్ల నుండి 19 సంవత్సరాల వారికి ఒక టాబ్లెట్‌ వేయాలన్నా రు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న పిల్లలతో పాటు బడికి వెళ్లకుండా గ్రామంలో ఉన్నవారికి కూడా ఈ మందులు ఇస్తామన్నారు. నులిపురుగుల మందులు వాడకుంటే పిల్లలకు ఏ విధమైన నష్టం జరుగుతుందో వాటిపై ఒక కరపత్రం తీసి ర్యాలీ ద్వారా పిల్లలకు, వారి తల్లితండ్రులకు ఉపాధ్యాయులకు కూడా తెలుపాలన్నారు. జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హా సళ్లకు సంబంధించిన అధికారులు, డీఆర్‌డీఏ వా రు స్వయం సహాయక సంఘాల వారికి తెలియజేసి జిల్లాలో వంద శా తం లక్ష్యం సాధించేలా కృషి చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి సబ్‌కలెక్టర్‌ గౌతం పోట్రూ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌, డీఎంహెచ్‌ఓ శ్రీధర్‌, డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీనారాయ ణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జైపాల్‌ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

ఉద్యోగ సంఘాల అభినందనలు

భారత ఎన్నికల సంఘం ప్రకటించిన బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీస్‌ అవార్డును రాష్ట్రపతి చేతుల మీ దుగా అందుకున్న కలెక్టర్‌ను పలు సం ఘా ల నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యోగులు అధికారుల సమన్వయంతో సత్పలితాలు సాధిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీ ఉద్యోగ జెఎసీ గౌరవాధ్యక్షుడు హరి అశోక్‌ కుమార్‌, ఎఓ వెంకటేశ్‌, బోగ శశిధర్‌, ఎండీ వకీల్‌, కృష్ణ ఆకుల సత్యం, ప్రభాకర్‌ రెడ్డి, నాగేందర్‌ రెడ్డి, సత్యనారాయణ, రాజేందర్‌ రావు, తిరుమల్‌ రావు, తదితరులు పాల్గొన్నారు. 


logo