సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Jan 29, 2020 , 04:07:43

కేటీఆర్‌కు కృతజ్ఞతలు

కేటీఆర్‌కు కృతజ్ఞతలు

మెట్‌పల్లి టౌన్‌/కోరుట్లటౌన్‌ : రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపల్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి మెట్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా రణవేని సుజాత-సత్యనారాయణ, వైస్‌ చైర్మన్‌గా బోయినిపల్లి చంద్రశేఖర్‌రావు, కోరుట్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా  అన్నం లావణ్య-అనిల్‌, వైస్‌ చైర్మన్‌గా గడ్డమీది పవన్‌ ఎన్నికవగా ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి వెళ్లి మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ గెలిచిన సందర్భంగా పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాక్షాంకలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ పురపాలనలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం పాలన అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి మన్నలను అందుకోవాలని పేర్కొన్నారు. ఇక్కడ కోరుట్ల, మెట్‌పల్లి టీఆర్‌ఎస్‌ నాయకులు మాడిశెట్టి ప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ కోరుట్ల పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, బురుగు రామస్వామి గౌడ్‌ తదితరులు ఉన్నారు.  


logo