సోమవారం 30 మార్చి 2020
Jagityal - Jan 29, 2020 , 04:07:43

మైనార్టీల సంక్షేమమే ధ్యేయం

మైనార్టీల సంక్షేమమే ధ్యేయం

పెగడపల్లి/వెల్గటూర్‌:  మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గానికి మండల, జిల్లా పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యులు రూపొందించిన 2020 నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి ఈశ్వర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్‌ మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు, వారి అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా వందల కోట్ల సబ్సిడీ రుణాలను అందజేస్తున్నారన్నారు. అనంతరం వెల్గటూర్‌ మండల పరిషత్‌ ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో ముద్రించిన నూతనసంవత్సర క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు.   ధర్మపురి నియోజక వర్గంలోని మండల పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యులు ఎండీ రఫీ (ధర్మారం) ఎండీ కైసర్‌ (ధర్మపురి), ఎండీ అలీ (గొల్లపల్లి), ఎండీ రహీమ్‌ (పెగడపల్లి), ఎండీ అబ్దుల్‌ రఫీ (బుగ్గారం), ఎండీ రి యాజ్‌ (వెల్గటూరు) కలిసి క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కో ఆప్షన్‌ సభ్యులతో పాటు పెగడపల్లి మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ రహీం, తదితరులు పాల్గొన్నారు. logo