గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Jan 29, 2020 , 03:38:46

ఎమ్మెల్యే సహకారంతో పట్టణాభివృద్ధి

ఎమ్మెల్యే సహకారంతో పట్టణాభివృద్ధి

జగిత్యాల టౌన్‌ : జగిత్యాల పట్టణాన్ని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ సహకారంతో సిరిసిల్ల, సిద్ధిపేట తరహాలో అభివృద్ధి చేస్తానని మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి పేర్కొన్నారు. మంగళవారం హౌసింగ్‌ బోర్డు కాలనీలోని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ జీఆర్‌ దేశాయ్‌ భవనం ఆవరణలో నూతనంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బోగ శ్రావణి ప్రవీణ్‌ దంపతులకు టీ సీనియర్‌ సిటిజన్‌, పెన్షనర్లు, టీజేసీతో పాటు పలు సంఘాల ప్రతినిధులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి పాటుపడుతానన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ జీఆర్‌ దేశాయ్‌, టీ పెన్షనర్ల జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, టీ సీనియర్‌ సిటిజన్ల ఉపాధ్యక్షుడు  రఘుపతి, టీ బీసీ జేసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్‌, జిల్లా నాయకులు పుప్పాల కిశోర్‌కుమార్‌, గంగాధర్‌, పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 


logo
>>>>>>