శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Jan 28, 2020 , 01:26:28

గులాబీ దళం విజయోత్సవం

గులాబీ దళం విజయోత్సవం

మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ/మెట్‌పల్లిటౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించి పాలక పగ్గాలు స్వీకరించిన అనంతరం సోమవార ం మధ్యాహ్నం పట్టణంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. చావిడి నుంచి ప్ర ధాన వీధుల మీదుగా విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. ఎమ్మెల్యే కల్వకుంట్ల  విద్యాసాగర్‌రావు నూతన చైర్‌పర్సన్‌ రానవేణి సుజాత, వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, కౌన్సిలర్లు ర్యాలీ లో పాల్గొన్నారు. అడుగడుగునా ప్రజలు నీరాజనలు పలికారు. ప్రధాన కూడళ్లలో పటాకాలు కా ల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఎమ్మెల్యే, చైర్‌పర్స న్‌, వైస్‌చైర్మన్‌లను గజమాలతో టీఆర్‌ఎస్‌ శ్రేణు లు ఘనంగా సన్మానించారు. అదే విధంగా ము స్లిం మైనార్టీ నాయకులు, వివిధ వర్గాల ప్రజలు పుష్పగుచ్ఛాలు అందించి పూలమాలలతో సత్కరించారు.  టీఆర్‌ఎస్‌ నాయకులు డా. సత్యనారాయణ, మాడిశెట్టి ప్రభాకర్‌, ఆకుల లింగారెడ్డి, లిం గంపల్లి సంజీవ్‌, షేక్‌మహ్మద్‌, సోహైల్‌, జావీద్‌, ఎలాల దశరథరెడ్డి, నేరేళ్ల దేవేందర్‌, వేముల ప్ర భాకర్‌, చాడ చందు, పిప్పెర రాజేశ్‌, బీమనాతి సత్యనారాయణ, షేక్‌ అమ్జాద్‌, ద్యావనపల్లి రా జారాం, ఉజగిరి శ్రీనివాస్‌, పన్నాల మాధవరెడ్డి, పెంట లింబాద్రి, నేమూరి సత్యనారాయణ, నిమ్మ ల భూమారెడ్డి, ఆకుల రాజరెడ్డి, చేగొండ శ్రీనివా స్‌, కొమిరెడ్డి శ్రీనివాస్‌, తుంగూరి మహేందర్‌, రా జగోపాల్‌, ఆడెపు శివకుమార్‌, ఒజ్జెల శ్రీనివాస్‌, జగన్‌  తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.


జగిత్యాలలో..

జగిత్యాల రూరల్‌ : జగిత్యాల మున్సిపల్‌ చైర్మన్‌గా బోగ శ్రావణి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పట్టణంలోని 37వ వార్డులో విజయోత్సవ ర్యాలీని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ఇంటింటికీ వెళ్లి తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. వార్డు ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ వార్డు సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. నాయకులు బోగ ప్రవీణ్‌, సుభాష్‌, సత్యం, నాగేష్‌, నవీన్‌, గంగాధర్‌, ప్రవీణ్‌, కార్తీక్‌, తదితరులు పాల్గొన్నారు. 


రాయికల్‌లో..

రాయికల్‌ రూరల్‌ : రాయికల్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సోమవారం పెద్ద ఎత్తున ర్యాలీ తీసీ సం బురాలు చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ప్ర మాణస్వీకారం ముగించుకొని బయటకు రాగానే వందలాది మంది కార్యకర్తలు వీరికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఓగ్గు డోలు కళాకారులు, నెమ లి పించాలు ధరించిన ఆదివాసులు ప్రత్యేక నృ త్యాలు చేయగా రాయికల్‌ పట్టణ పువీధులు తెలంగాణ నినాదాలతో మారుమ్రోగాయి. ప్రధాన కూ డళ్ళలో పటాకులు పేల్చుతూ మిఠాయిలు పంచా రు. విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పాల్గొని కార్యకర్తలను ఉత్తేజ పరిచారు. 


logo