సోమవారం 30 మార్చి 2020
Jagityal - Jan 28, 2020 , 01:23:43

పల్లె ప్రగతి పనులను వెంటనే పూర్తి చేయాలి

పల్లె ప్రగతి పనులను    వెంటనే పూర్తి చేయాలి

జగిత్యాల, నమస్తే తెలంగాణ : జిల్లాలోని అన్ని గ్రామాల్లో ట్రా క్టర్ల కొనుగోళ్లను వందశాంతం పూర్తి చేయాలని కలెక్టర్‌ శరత్‌ ఆదేశించారు. పల్లె ప్రగతిలో భాగంగా ట్రాక్టర్ల కొనుగోలుపై సోమవారం కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో కలెక్టర్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మండల పంచాయతీ అధికారులతో మండలాల వారీగా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రాక్టర్ల కొనుగోలులో నూటికి నూరు శాతం చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రాక్టర్ల కొనుగోలు విషయమై పదకొండో కాలంలో ఉన్న ప్రొ ఫార్మాను పూర్తి చేయాల్సిందిగాను, ట్రాక్టర్ల కొనుగోలు విషయమై ఏ గ్రామంలోనైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లయితే వాటిని వెంటనే పూర్తి చేసుకోవాలని బ్యాంకు డాక్యుమెంట్స్‌ పూర్తి చేయాలనీ, ఏజెన్సీకి చెక్కులు అందజేశారు. వాటిలో ఏమైనా పెండింగ్‌ ఉన్నాయా? బ్యాంకు, ట్రెజరీ, ఎజెన్సీలో పెండింగ్‌ ఉందా వివరాలను తీసుకుని రేపు నిర్వహించే సమావేశంకు రావాల్సిందిగా కోరారు. ప్రతి గ్రామంలో బాడీ ఫ్రిజర్‌, వాట్‌వాష్‌, దోమల మిషన్లు దాతల దగ్గర నుంచి స్వీకరించాల్సిందిగా కోరారు. ఇంకా ఎన్ని గ్రామాల్లో కొనుగోలు చేయలేదో వాటి వివరాలను తీసుకుని రావాల్సిందిగా ఆదేశించారు. రోడ్డు పక్కన నాటిన ఆవెన్యూ ప్లాంటేషన్‌ మొక్కలకు పాదులు, కంప, ట్రీగార్డ్‌, మొక్క పెరుగుతుంటాయి, అలాగే ట్రీ గార్డుల నుంచి కొమ్మలు వచ్చిన వాటిని సరిచేయాలన్నారు. మంకీఫుడ్‌కోర్టులో మొక్కలు సరిగా ఉన్నాయా లేవా, చూసి సరిగా లేని ఎడల వాటిని కాపాడే బాధ్యత కార్యదర్శి, సర్పంచులదేనన్నారు. గ్రామ కార్యదర్శికి మోమె ఇచ్చి, సర్పంచ్‌కు నోటీసు ఇవ్వాలని సంబంధిత మండల పంచాయతీ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని మొదటిసారిగా మెయిన్‌ రోడ్డులను తనిఖీ చేస్తాననీ, అనంతరం ఇంటర్నల్‌ రోడ్లను తనిఖీ చేస్తామన్నారు. అందువల్ల తప్పకుండా పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను జాగ్రత్తగా చేయాలని ఈ సందర్భంగా అధికారులను సూచించారు.

ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలి

 జగిత్యాల మున్సిపల్‌ పాలకవర్గంలో కొలువుదీరిన ప్రతి వా ర్డు కౌన్సిలర్‌ పాటుపడాలని  కలెక్టర్‌ శరత్‌ అన్నారు. జగిత్యాల మున్సిపల్‌ వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన కలెక్టర్‌ వార్డు సభ్యు లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మనసు గెలుచు కునేలా నడుచుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు కృష్ణ ఆదిత్య తో మున్సిపల్‌ ఎన్నికల విషయమై మాట్లాడారు. 


logo