శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jagityal - Jan 28, 2020 , 01:22:51

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

జగిత్యాల లీగల్‌ : సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి సోమవారం జిల్లా సెర్ప్‌ సిబ్బంది పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మెనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా సెర్ప్‌ సిబ్బందిని ఖచ్చితంగా క్రమబద్ధీకరిస్తామని ప్రకటించిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని సమాఖ్య కార్యాలయ ఆవరణలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. 18 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతా ల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేయడం, మహిళా సంఘాల అభివృద్ధికి పాటుపడడంలో సెర్ప్‌ సిబ్బం ది పాత్ర ముఖ్యమైందన్నారు. మా శ్రమను గుర్తించి ముఖ్యమంత్రి ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించడంపై  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెర్ప్‌ సిబ్బందిలో ఆనందం వెల్లివిరిసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెర్ప్‌ జాక్‌ నాయకులు వోదెల గంగాధర్‌, వెంకటేశం, దాస్‌, ఎస్‌ రత్నాకర్‌, ఆర్‌ చంద్రకళ, రమేశ్‌, కే చిన్నరాజయ్య, గంగామణి, ఏ సత్యం, రవికుమార్‌, శంకర్‌, విజయలక్ష్మి, ఏపీఎంలు, సీసీలు, ఎంఎస్‌సీసీలు, తదితరులు పాల్గొన్నారు. 

కొడిమ్యాల: మండల కేంద్రంలో సెర్ప్‌ కార్యాలయంలో  సి బ్బంది సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి సోమవారం పాలాభి షేకం చేశారు.  ఈ సందర్భంగా ఇటీవల తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థలో ఉద్యోగస్తుల సర్వీస్‌ను రేగ్యులర్‌ చేస్తానని హామీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం దేవరాజం, సీసీలు కృష్ణమోహన్‌, పద్మ, వీరకుమార్‌, స్వరూప ఉన్నారు. 


logo