గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Jan 28, 2020 , 01:22:51

రక్తహీనత నిర్మూలనపై దృష్టి పెట్టాలి

రక్తహీనత నిర్మూలనపై దృష్టి పెట్టాలి

పెగడపల్లి:  రక్తహీనత నిర్మూలనపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని పోషణ్‌ అభియాన్‌ మల్యాల ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్‌ మామిడిపల్లి లక్ష్మణ్‌ కోరారు. సోమవారం స్థానిక మండలపరిషత్‌ కార్యాలయంలో ఎం పీపీ గోళి శోభ అధ్యక్షతన పోషణ్‌ అభియాన్‌పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న లక్ష్మణ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రక్త హీనతను ప్రతి యేటా 3శాతం తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించిందన్నారు.  మహిళలు, కిషోరబాలికలకు పౌష్ఠికాహారం ప్రాముఖ్యతను వివ రించాలని సూచించారు.   అలాగే చిన్నారుల ఎదుగుల లో పం 2శాతం, పుట్టిన పిల్లలు తక్కవ బరువుతో పుట్టకుండా 2శాతం తగ్గించాలని వివరించారు. ఈ సందర్భంగా పోష ణ్‌ అభియాన్‌ మండల కమిటీని నియమించారు. చైర్మన్‌గా తాసిల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎంపీడీఓ వెంకటేశం, కార్యదర్శిగా ఐసీడీఎస్‌ సీడీపీవో నర్సింగరాణి, సభ్యులుగా ఎంపీఓ భీమ జయశీల, మండల వైద్యాధికారి సుధాకర్‌, ఎంఈఓ శ్రీనివాస్‌, ఈజీఎస్‌ ఏపీఓ వేణు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ విజయలక్ష్మి, మండలంలోని అన్ని స్థానాలకు చెందిన 14 మంది ఎంపీటీసీ సభ్యులను నియమించారు. ఈ కార్యక్రమంలో పెగడపల్లి, ల్యాగలమర్రి, ఎల్లాపూర్‌ ఎంపీటీసీ సభ్యులు బొమ్మెన జమున, మందపల్లి అంజయ్య, కొత్తపల్లి రవీందర్‌, సెర్ప్‌ ఏపీఎం డీ సమత తదితరులు పాల్గొన్నారు.


logo