బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Jan 28, 2020 , 00:59:48

రాయికల్‌ మున్సిపల్‌ నూతన కౌన్సిల్‌ పాలకవర్గం కొలువుదీరింది

 రాయికల్‌ మున్సిపల్‌ నూతన కౌన్సిల్‌ పాలకవర్గం కొలువుదీరింది

రాయికల్‌ :. మున్సిపల్‌ కౌన్సిల్‌ స భ్యులతో సోమవారం ఉదయం 11గంటలకు ప్రత్యేక అధికారి, జడ్పీ సీఈవో శ్రీనివాస్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపల్‌ కౌంటింగ్‌ అనంతరం టీఆర్‌ఎస్‌ కౌన్సిల్‌ సభ్యులు క్యాంపునకు తరలివెళ్లిన విషయం తెలిసిందే. క్యాంపు నుంచి నేరుగా సోమవారం ఉదయం 11గంటల్లోపు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, కాంగ్రెస్‌, బీజేపీ, స్వతంత్ర కౌన్సిలర్లతో ఉదయం 11గంటలకు ప్రత్యే క అధికారి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.  మున్సిపల్‌ కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీ కారం నేపథ్యంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

రాయికల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు..

రాయికల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా పట్టణంలోని 12వ వార్డు కౌన్సిలర్‌ మోర హన్మాండ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మధ్యాహ్నం 12గంటల నుంచి మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మ న్‌ నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా, 12:30గంటలకు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌గా మోర హన్మాండ్లును 10వ వార్డు కౌన్సిలర్‌ మ్యాకల కాంతారావు ప్రతిపాదించగా, 3వ వార్డు కౌన్సిలర్‌ మారంపెల్లి సాయిబాబు బలపరిచారు. చైర్మన్‌గా మోర హన్మాండ్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మున్సిపల్‌ ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌ ప్రకటించారు. 

వైస్‌ చైర్మన్‌గా గండ్ర రమాదేవి..

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా 1వ వార్డు కౌన్సిలర్‌ గండ్ర రమాదేవి ఎన్నికయ్యారు. వైస్‌ చైర్మన్‌గా గండ్ర రమాదేవిని 4వ వార్డు కౌన్సిలర్‌ తురగ శ్రీధర్‌ రెడ్డి ప్రతిపాదించగా 9వ వార్డు కౌన్సిలర్‌ శ్రీరాముల సువర్ణ బలపరిచారు. వైస్‌ చైర్మన్‌గా గండ్ర రమాదేవి ఎన్నికయ్యారని ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌ ప్రకటించారు. 


logo