ఆదివారం 29 మార్చి 2020
Jagityal - Jan 27, 2020 ,

ఎగిరిన మువ్వన్నెల జెండా

ఎగిరిన మువ్వన్నెల జెండా

జగిత్యాల టౌన్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో వాడవాడలా మువ్వన్నెల జెండా ఎగిరింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో వేడుకలు ఘనం గా నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీ వో ఘంటా నరేందర్‌, అర్బన్‌ తాసిల్దార్‌ కార్యాలయంలో  తాసిల్దార్‌ నలుమాల వెంకటేశ్‌, రూరల్‌ తాసిల్దార్‌ కార్యాలయంలో తాసిల్దార్‌ దిలీప్‌నాయక్‌, కోర్టులో సీనియర్‌ జడ్జి వెంకటేశ్వర్‌రావు, మున్సిపల్‌లో మున్సిపల్‌ కమిషనర్‌ లచ్చిరెడ్డి, జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో కిషన్‌రావు, టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ జయేశ్‌రెడ్డి జెండా ఎగురవేశారు. ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుదక్షిణాదేవి, డీఈవో కార్యాలయంలో ఎస్‌.వెంకటేశ్వర్లు, ఫారెస్ట్‌ కార్యాలయం లో ఎ.నర్సింహారావు, జిల్లా వ్యవసాయశాఖ కా ర్యాలయంలో ఏడీఏ అమీనాబీ, పొలాస పరిశోధనా స్థానంలో పరిశోధనా స్థానం సహ సంచాలకుడు డాక్టర్‌ ఉమారెడ్డి, వ్యవసాయ కళాశాలలో డీన్‌ డాక్టర్‌ సునీతాదేవి, వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో మార్కెట్‌ కార్యదర్శి రాజేశ్వరి, సింగిల్‌విండో కార్యాలయాల్లో అయిలవేని గంగాధర్‌, జిల్లా సహకారాధి కార్యాలయంలో రామానుజా చార్య, ఎస్‌కేఎన్‌ఆర్‌ ప్రభుత్వ పిజీ, డిగ్రీళాశాలలో ప్రిన్సిపాల్‌ అరిగెల అశోక్‌, ప్రభుత్వ మహి ళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.కిషన్‌, విద్యుత్‌ కార్యాలయంలో ఎస్‌ఈ శ్రావణ్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, జగిత్యాల ఆఫీసర్స్‌ క్లబ్‌లో కార్యదర్శి డాక్టర్‌ రామకృష్ణారావు జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. టవర్‌ సర్కిల్‌, తాసిల్‌ చౌరస్తాలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు జెండా ఎగురవేశారు. జగిత్యాల బస్‌ డిపో లో డీఎం జగదీశ్వర్‌, కొత్త బస్టాండ్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చౌక్‌లో  టీఆర్‌ఎస్‌ నాయకుడు ఓరుగంటి రమణారావు ఆధ్వర్యంలో పతాకావిష్కరణ చేశారు. జగిత్యాల బులియన్‌ సంఘంలో  వంగల మురళి, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చకినం కిషన్‌, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ఆకో జు కృష్ణ, పద్మశాలీ సేవా సంఘం అధ్యక్షుడు  ఒ ల్లాల గంగాధర్‌ ఆధ్వర్యంలో జెండా ఎగురువేశా రు. అలాగే పట్టణంలోని చైతన్య కాన్సెప్టు, సిద్దార్థ, జ్యోతి, మానస ఎక్స్‌లెన్స్‌, ఐఐటీ చుక్కా రామ య్య, గౌతమ, శాతవాహన, చంద్రగ్రామర్‌, ఆక్స్‌ఫర్డ్‌, హిమానీ, భారత్‌ కాన్సెప్ట్‌, శ్రీకృష్ణవేణి టా లెంట్‌ స్కూల్‌, నలందా, చైతన్య, జవహర్‌, నంది ని, శ్రీసరస్వతీ డీజీ  స్కూల్‌ తదితర ప్రైవేట్‌ పాఠశాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా రిపబ్లిక్‌ డే ఉత్సవాలను జరుపుకుని అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభాత బేరిలో చిన్నారుల కోలాటాలు, నృత్యాలు, బతుకమ్మ ఆటలు, బోనాలు, విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాల్లో ఎంపీపీ గర్వందుల మానస, డీఏవీ మహేందర్‌, కాంగ్రెస్‌ నాయకులు గిరి నాగభూషణం, బండ శంకర్‌, కొత్త మోహన్‌, దేవేందర్‌రెడ్డి, వీరబత్తిని శ్రీనివాస్‌, గాజుల రాజేందర్‌, యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షులు రఘువీర్‌గౌడ్‌, గోపు రాజేశ్‌, రియాజ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు దావ సురేశ్‌, మిసాక్‌ అహ్మద్‌, గుగ్గిళ్ల హారీశ్‌, పృథ్వీ, వేణు, సాగర్‌, ముజాహిద్‌, మోసీ న్‌, కూతురు రాజేశ్‌, తిరుమల్‌, శివప్రసాద్‌, దావరశెట్టి జనార్దన్‌, టీడీపీ నాయకులు సత్యంరావు, వొల్లెం మల్లేశం, బాలె శంకర్‌,  బోగ వెంకటేశ్వర్లు, శ్రీధర్‌గౌడ్‌,  ఆఫీసర్స్‌ క్లబ్‌ కార్యదర్శి సత్తిరెడ్డి, సు గుణాకర్‌, వంగల దేవకిషన్‌, కమటాల శ్రీనివాస్‌, ఎలిమెల్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. 


logo