బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Jan 27, 2020 ,

త్యాగధనుల ఫలితమే గణతంత్రం

త్యాగధనుల ఫలితమే గణతంత్రం

జగిత్యాల క్రైం: ఎందరో త్యాగధనుల ఫలితమే గణతంత్రమని, వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరముందని ఎస్పీ సింధూశర్మ అన్నా రు. భారత రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. 71వ గణతంత్ర దినోత్సవాన్ని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో, ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవోలో ఎస్పీకి పోలీసు అధికారులు గౌరవ వం దనం సమర్పించారు. అనంతరం దేశ నాయకుల చిత్రపటాలకు పూల మాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణతోనే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. రాజ్యాంగం కల్పించిన చట్టాల ద్వారానే పాలన సాగుతుందన్నారు. రాజ్యాంగం కల్పించిన చట్టాల అమలు బాధ్యత పోలీస్‌శాఖపై అధికంగా ఉంటుందన్నా రు. విలువలకు కట్టుబడి ప్రజల రక్షణ, చట్టాల అమలుకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీలు వెంకటరమణ, ప్రతాప్‌, ఆర్‌ఐ నవీన్‌, ఏవో స్వామి, సిబ్బంది పాల్గొన్నారు. 


logo