గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Jan 26, 2020 , 04:25:28

క్లిన్‌స్వీప్‌

క్లిన్‌స్వీప్‌జగిత్యాల జిల్లాలో గులాబీ జైత్రయాత్ర కొనసాగింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగిరింది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీల్లో అధికార పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఐదు బల్దియాల పరిధిలో 134వార్డులకు గానూ 84స్థానాలను సొంతం చేసుకొని తిరుగులేని శక్తిగా అవతరించింది. కాంగ్రెస్‌ 20వార్డులతో ‘హస్త’వ్యస్తమై జగిత్యాలలో కంచుకోట కుప్పకూలింది. 13వార్డులతో  ‘కమలం’ సరిపుచ్చుకోగా 17వార్డుల్లో స్వతంత్రుల హవా కొనసాగింది. మొత్తానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలే అధికార పార్టీని విజయతీరాలకు చేర్చగా, గెలుపులో మంత్రి ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నీతామై నడపడంతో టీఆర్‌ఎస్‌ సుస్పష్టమైన మెజారిటీ సాధించింది.
- జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో గులాబీ జైత్రయాత్ర కొనసాగింది. ఐదు మున్సిపాలిటీలపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగిరింది. జగిత్యా ల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి ము న్సిపాలిటీల్లో అధికార పార్టీ ఘన విజయాన్ని సా ధించింది. మొత్తం 134 వార్డులకు గానూ కో రుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో నాలుగు వార్డులను ఇంతకు ముందే టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గె లుచుకుంది. ఈ నెల 22న 130 వార్డులకు ఎన్నికలు జరగగా, శనివారం జగిత్యాల సమీపంలోని వీఆర్కే ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఓట్ల లెక్కింపు ని ర్వహించారు. ప్రతి మున్సిపాలిటీలోనూ చైర్మన్‌ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కావాల్సిన స్పష్టమైన మెజార్టీని టీఆర్‌ఎస్‌ సాధించింది.

84 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ విజయం 

జగిత్యాలలో 48, కోరుట్లలో 33, మెట్‌పల్లిలో 26, ధర్మపురిలో 15, రాయికల్‌లో 12 వార్డులు మొత్తంగా జిల్లాలో 134 వార్డులు ఉన్నాయి. కో రుట్లలో మూడు, మెట్‌పల్లిలో ఒక వార్డు ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన 130 వార్డుల్లో పోలింగ్‌ నిర్వహించారు. వీటిలో 84 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సా ధించగా, కాంగ్రెస్‌ 20వార్డుల్లో, బీజేపీ అభ్యర్థులు 13 వార్డుల్లో, ఇతరులు (ఎంఐఎం, ఏఐఎఫ్‌బీ, స్వతంత్రులను కలుపుకొని) 17 స్థానాల్లో విజయం సాధించారు.

ప్రతి మున్సిపాలిటీలోనూ స్పష్టమైన మెజార్టీ

ఐదు మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ పదవిని కైవసం చేసుకునేందుకు స్పష్టమైన మె జార్టీ సీట్లను దక్కించుకుంది. జగిత్యాలలో 48 వార్డులకు 30వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు జ యకేతనం ఎగురవేశారు. కోరుట్లలో 33 వార్డుల కు 21 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. మెట్‌పల్లిలో 26 వార్డులకు గాను 16 వార్డులను కైవ సం చేసుకుంది. ధర్మపురిలో 15 వార్డుల్లో 8 వా ర్డులను గెలిచింది. రాయికల్‌లో 12 వార్డులు ఉం డగా, 9వార్డుల్లో టీఆర్‌ఎస్‌ పాగా వేసింది. 

టీఆర్‌ఎస్‌కు 43.41శాతం ఓట్లు

జిల్లాలో మొత్తం పట్టణ ఓటర్లు 1,97,533 మంది ఉన్నారు. 1,43,627 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదు బల్దియా ల్లో 62,356 ఓట్లను (43.41 శాతం’ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. జగిత్యాలలో 83769 ఓ ట్లకు, 60,406 ఓట్లు పోల్‌ కాగా, 26,704 ఓ ట్లు (44.20శాతం), కోరుట్లలో 50,337 ఓట్లకు 36,369 ఓట్లు పోలవగా, 15,751 ఓట్లు (43.30 శాతం), రాయికల్‌లో  11,920 ఓట్లకు 9061 ఓట్లు పోలవగా,  3834 ఓట్లు (42.22 శాతం), మెట్‌పల్లిలో 39,101 ఓ ట్లకు 28,309 ఓట్లు పోలవగా, 11,513 ఓట్లతో (40. 66శాతం) ఓట్లను, ధర్మపురిలో 12379 ఓట్లకు 9482 ఓట్లు పోలవగా 4554 ఓట్లను (48.02 శాతం) టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది.

తీవ్రంగా దెబ్బతిన్న, కాంగ్రెస్‌, బీజేపీ

జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన కాంగ్రెస్‌తో పాటు, పార్లమెంట్‌ ఎన్నికల్లో వికసించిన కమలం తీవ్రంగా దెబ్బతిన్నాయి. జగిత్యాల మున్సిపాలిటీ ని నలభై ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్‌కు ఈ సారి ఎన్నికల్లో చావుతప్పి కన్నులోటబోయిన పరిస్థితి ఎదురైంది. జగిత్యాలలో 48 వార్డుల్లో పోటీ చేసి న కాంగ్రెస్‌, కేవలం ఏడు వార్డుల్లోనే విజయం సాధించింది. ఇక్కడ ఆ పార్టీ 14,901 ఓట్ల (24.66 శాతం)కే పరిమితమైంది. 11వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు వందకు లోపే ఓట్లు సాధించారు. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సొంత వార్డుల్లో, కాంగ్రెస్‌ అభ్యర్థి, పీసీ సీ రాష్ట్ర కార్యదర్శి బండ శంకర్‌ పరాజయం పొం దారు. కోరుట్ల, మెట్‌పల్లిలోనూ ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పలేదు. ఇక పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో అధిక ఓట్లను సాధించిన బీజేపీ, ఈ సారి మున్సిపల్‌ ఎన్నికల్లో పూర్తిగా వాడిపోయిం ది. వందకు పైగా వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ కేవ లం 13 వార్డుల్లో మాత్రమే విజయం సాధించిం ది. జగిత్యాలలో 38 వార్డుల్లో పోటీ చేసి కేవలం మూడింట విజయం సాధించింది. మొత్తంగా 27,140 ఓట్ల (18శాతం)కే పరిమితమైంది. కో రుట్లలో 30 వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం ఐదు వార్డుల్లో గెలిచింది. మెట్‌పల్లిలో 4 వా ర్డుల్లో, రాయికల్‌లో ఒక వార్డులో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. మూడు స్థానాల్లో ఎంఐఎం, ఒక స్థానంలో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థులు విజయం సాధించారు. 13 వార్డులను స్వతంత్రు లు దక్కించుకోగలిగారు. ఎంఐఎం, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, స్వతంత్రులు, నోటా కాలమ్‌, చెల్ల ని ఓట్లు మొత్తంగా జిల్లాలో 27,045 నమోదు కాగా, 18.70శాతం వాటా దక్కించుకున్నాయి.

మున్సిపాలిటీల్లో ‘నవ’శకం

జగిత్యాల మున్సిపాలిటీలో పోటీ చేసిన మాజీ కౌన్సిలర్లు చాలా మంది ఓటమి పాలయ్యారు. న లుగురైదుగురు మినహా అందరికీ చేదు అనుభవ మే ఎదురైంది. కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లోను పాత అభ్యర్థులకు ఇబ్బందులు తప్పలేదు. జగిత్యాలలో 36 మంది, కోరుట్లలో 20 మంది, మె ట్‌పల్లిలో 17 మంది కొత్తవారు విజయం సాధించారు. రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీలు కొ త్తగా ఏర్పడిన నేపథ్యంలో గతంలో సర్పంచ్‌లు గా, ఎంపీటీసీలుగా చేసిన వారు ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా కొత్తగానే కౌన్సిల్‌ గడప తొక్కబోతున్నారు. 134 వార్డుల్లో వందకు పైగా అభ్యర్థులు మొదటిసారి విజయం సాధించారు. చాలా వార్డుల్లో యువకులే విజయం సాధించడం కనిపించింది. జగిత్యాలలో దాదాపు 30మంది 35ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. 

సంక్షేమ పథకాలే గెలుపు మార్గాలు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు మార్గాలుగా మారాయి. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆదరించారు. అభ్యర్థి ఎవరన్న దానికంటే, పార్టీవైపే మొగ్గు చూపారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌ పట్టణాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న బీడీ కార్మికులు టీఆర్‌ఎస్‌వైపే నిలిచారు. వృద్ధాప్య, దివ్యాంగ, ఒంటరి మహిళ, బోధకాలు పింఛన్లు, అమ్మఒడి, కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ప్రభావం చూపాయి.logo
>>>>>>