మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Jan 26, 2020 , 04:18:57

విజయం వెనుక వ్యూహం

విజయం వెనుక వ్యూహం
  • - మున్సిపల్‌ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు
  • - యువనేత కేటీఆర్‌ సారథ్యంలో కార్యాచరణ
  • - ప్రతిపక్షాలకు అంతుచిక్కని ఆలోచన
  • - అభ్యర్థుల ఎంపిక నుంచే పక్కా ప్రణాళిక
  • - ఇతర పార్టీలకు అందని స్థాయిలో ప్రచారం
  • - నాలుగు మున్సిపాలిటీల్లో జయకేతనం

(మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ) మున్సిపల్‌ ఎన్నికల వేళ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు పక్కా వ్యూహంతో ముందుకెళ్లారు. పార్టీ వర్కింగ్‌ ప్రె సిడెంట్‌ కేటీఆర్‌ సారథ్యంలో పకడ్బందీ కార్యాచరణ రూ పొందించుకున్నారు. అభ్యర్థులను ఎంపిక చేయడంలో పార్టీ బాధ్యులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. ఇతర పార్టీల మాదిరిగా పైరవీలకు తావులేకుండా ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న కార్యకర్తలను ఎంచుకుని బీ-ఫారాలు ఇచ్చారు. ముఖ్యంగా పార్టీ అధిష్టానం ప్రజల మధ్యకు వెళ్లి పలు సర్వేలు నిర్వహించి, ప్రజలు సూచించిన కార్యకర్తలకే టికెట్లు ఇచ్చినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు మున్సిపాలిటీలకు మంత్రిగా ప్రాతిని థ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికలు తన పనితీరుకు రెఫరెండమని ఆయన చేసిన ప్రకటనకు ప్రజలు సానుకూలంగా స్పం దించారు. కొన్ని రాజకీయ పార్టీలు నాయకులు ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే ప్రజల మధ్యకు వెళ్తుండగా, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు మాత్రం నిత్యం ప్రజల మధ్యే ఉం టూ, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వచ్చారు. ప్ర భుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందించడంలో ఆది నుంచీ కృతార్థులవుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను లోతుగా ప్రచారం చేయగలిగారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు చేసిన ప్రచారాన్ని పట్టణ ప్రజలు పూర్తిగా విశ్వసించారు. ఫలితాలు ఇందుకు నిదర్శనమని నాయకులు పేర్కొంటున్నారు.

ఫలించిన కృషి..

టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఒక్కో మున్సిపాలిటీకి ఇద్దరు లేదా ముగ్గురు సీనియర్‌ నాయకులను ఇన్‌చార్జీలుగా నియమించింది. అంతే కాకుండా స్థానిక నాయకులను వార్డులకు ఇన్‌చార్జీలుగా నియమించి ప్రచారం చేయించింది. అన్నీతానై కో రుట్ల, మెట్‌పల్లిలో ఎమ్మెల్యే కల్వకుంట్ల ప్రచారం విస్తృతంగా చేశారు. రెండు బల్దియాల్లో వార్డుల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు బాధ్యతను తన మీదే వేసుకున్నారు. దీనికితోడు కాంగ్రెస్‌, బీజేపీల ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు. కే వలం టీఆర్‌ఎస్‌తోనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని ముఖ్యనేతలు, ఆ పార్టీ నాయకులు చేసిన ప్రచార వ్యూహం ఫలించింది. ఇక జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని జగిత్యా ల, రాయికల్‌ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఆది నుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యంగా జగిత్యాల, కొత్త మున్సిపాలిటీ రా యికల్‌పై గులాబీ జెండా ఎగరేలా చేశారు. ఇక ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఇంటింటి ప్రచార వ్యూహం ఫలితాన్నిచ్చింది. కొత్తగా బల్దియాగా అవతరించిన ధర్మపురిలో కాం గ్రెస్‌ నుంచి గట్టి పోటీ ఉన్నా మున్సిపాలిటీని దక్కించుకోవడంలో మంత్రి ఈశ్వర్‌ అహర్నిశలూ కృషి చేశారు. పట్టణాభివృద్ధి బాధ్యత తనదేనంటూ భరోసా ఇచ్చారు. ప్రచారంతో చేరువై మెజార్టీ స్థానాలను దక్కించుకున్నారు.logo
>>>>>>