శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Jan 25, 2020 , 01:00:59

పుర ఫలితాలు నేడే

పుర ఫలితాలు నేడే
  • - మరికొద్ది గంటల్లో మున్సి‘పోల్స్‌' రిజల్ట్స్‌
  • - వీఆర్కే కళాశాలలో ఏర్పాట్లు పూర్తి
  • - ఉదయం 8నుంచే ప్రారంభం
  • - పది గంటల వరకు రిజల్ట్స్‌ తేలే అవకాశం
  • - ఒకటి లేదా రెండు రౌండ్లలో లెక్కింపు
  • - కేంద్రాన్ని పరిశీలించిన జేసీ బేతి రాజేశం
  • - సాఫీగా పూర్తయ్యేలా చర్యలు : కలెక్టర్‌ శరత్‌
  • - మూడంచెల భద్రత కల్పిస్తున్నాం : ఎస్పీ సింధూశర్మ

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏ ర్పాట్లూ పూర్తయ్యాయి. శనివారం ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుండగా 10గంటల కల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు కోసం 260 టేబుళ్లు, 314మంది సిబ్బందిని నియమించారు. జగిత్యాల శివారు గ్రామం నూకపల్లిలోని వీఆర్కే కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని జేసీ బేతి రాజేశం శుక్రవారం పరిశీలించారు.

బల్దియాలవారీగా సిబ్బంది

జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి 115 మంది సూపర్‌వైజర్లు, 115మంది అసిస్టెంట్లు, 16 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.  96 టేబుళ్లు, 3హాళ్లు ఏర్పాటు చేశారు. కోరుట్ల మున్సిపాలిటీకి 72మంది సూపర్‌వైజర్లు, 72 మంది అసిస్టెంట్లు, 11మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 60టేబుళ్లు, 2హాళ్లు ఏర్పాటు చే శారు. మెట్‌పెల్లి మున్సిపాలిటీకి 60మంది సూపర్‌వైజర్లు, 60మంది అసిస్టెంట్లు, 8మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 50టేబుళ్లు, 2హాళ్లు ఏర్పాటు చేశారు. రాయికల్‌ మున్సిపాలిటీకి 15 మంది సూపర్‌వైజర్లు, 30మంది అసిస్టెంట్లు, న లుగురు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 12 టేబుళ్లు, ఒక హాల్‌ ఏర్పాటు చేశారు. ధర్మపురి ము న్సిపాలిటీకి 18మంది సూపర్‌వైజర్లు, 36మంది అసిస్టెంట్లు, ఐదుగురు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 15టేబుళ్లు, హాల్‌ను ఏర్పాటు చేశారు.

రెండు దశల్లో లెక్కింపు ప్రక్రియ

ఓట్ల లెక్కింపు ప్రక్రియను రెండు దశల్లో చేపట్టాలని నిర్ణయించారు. ఒకటి ప్రాథమిక దశ, రెం డోది ఫలితం నిర్దేశించే దశ (గుర్తుల వారీగా ఓట్ల లెక్కింపు)గా నిర్దేశించారు. ఓట్ల లెక్కింపు పర్యవేక్షకులు, సహాయకులు ఉదయం 6గంటలకే కేం ద్రానికి చేరుకుంటారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో 7గంటలకు స్ట్రాంగ్‌ రూంను తెరుస్తారు. బ్యాలెట్‌ బాక్సులను సంబంధిత టేబుళ్ల వద్దకు తెస్తారు. ఓట్ల లెక్కింపు కోసం ప్రతి టేబుల్‌ వద్ద పర్యవేక్షకుడు, ఇద్దరు సహాయకులు ఉంటారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు లెక్కిస్తారు.

అనుమానాస్పద ఓట్లపై ఆఖర్లో నిర్ణయం

ప్రతి టేబుల్‌పై ఆయా వార్డుల్లో పోటీ చేసిన అ భ్యర్థులకు ఒక్కో ట్రేను ఉంచుతారు. నోటాకు ఒక టి, అనుమానంగా ఉన్న ఓట్లకు మరొకటి పెడతా రు. వచ్చిన ఓట్లను ఆయా అభ్యర్థికి సంబంధించి న ట్రేల్లో వేస్తారు. నోటాకు వచ్చిన ఓట్లను నోటా ట్రేలో, సిరా సరిగా అంటని, రెండువైపులా అం టి, అనుమానంగా కనిపించే ఓట్లను మరో ట్రేలో వేస్తారు. అనుమానాస్పదంగా ఉన్న ఓట్లపై ఆఖర్లో  అభ్యర్థులను లేదా ఏజెంట్లను పిలిచి వారి సమక్షంలో రిటర్నింగ్‌ అధికారి నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారు. 
        

మధ్యలో ముద్ర ఉంటే స్కేలుతో కొలిచి..

బ్యాలెట్‌ పత్రంపై ఓటర్లు వేసిన స్వస్తిక్‌ ముద్ర ఇద్దరు అభ్యర్థుల పేర్ల మధ్యలో ఉంటే స్కేలుతో కొలిచి నిర్ణయం తీసుకుంటారు. ఇద్దరిలో ఏ అభ్య ర్థి పేరుకు సమీపంలో ముద్ర ఉందో చూసి ఓటు ను ఆ అభ్యర్థి ఖాతాలో వేస్తారు. అభ్యర్థి పేరుపై స్వస్తిక్‌  ముద్ర వేయకుండా టిక్‌ చేసినా పరిగణనలోకి తీసుకుంటారు. ఇద్దరు అభ్యర్థుల పేర్లపై టి క్‌ ఉంటే తిరస్కరిస్తారు. ఎవరైనా ఓటర్లు బ్యాలెట్‌ పత్రంపై ఎక్కడైనా తమ ఓటరు సీరియల్‌ నంబర్‌ రాస్తే వాటిని తిరస్కరిస్తారు. 

కేంద్రాల సంఖ్య ఆధారంగా ఏజెంట్ల నియామకం

వార్డుల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల సంఖ్య ఆధారంగా కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకానికి ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఉదాహరణకు ఒకే వార్డులో నాలుగు పోలింగ్‌ కేంద్రాలుంటే ముగ్గురు ఏజెంట్ల నియామకానికి అనుమతిస్తారు. ఇందులో ఓట్ల లెక్కిం పు టేబుళ్ల వద్ద ఏజెంటును నియమించుకునే వెసులుబాటు కల్పించారు.

రీ కౌంటింగ్‌ చేయాలంటే

వార్డుల పరిధిలోని ఓట్ల లెక్కింపు పూర్తికాగానే కౌంటింగ్‌ ఏజెంట్ల సంతకాలు తీసుకున్న తర్వాత రెండు నిమిషాల వ్యవధిలోనే రిటర్నింగ్‌ అధికారి ఆయా వార్డుల ఫలితాన్ని వెల్లడిస్తారు. ఫలితంపై అభ్యర్థుల్లో ఎవరికైనా అభ్యంతరాలుంటే 15నిమిషాల్లోపు రాత పూర్వకంగా రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు సమర్పిస్తేనే రీ కౌంటింగ్‌కు అవకాశం ఉంటుంది. రీ కౌంటింగ్‌పై తుది నిర్ణయం మా త్రం రిటర్నింగ్‌ అధికారిదేనని ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సమాన ఓట్లు వస్తే

ఏదైనా వార్డులో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో విజేతను ప్రకటించనున్నారు. ఇందుకు గానూ రెండు బాక్సుల్లో ఒక్కో అభ్యర్థి పేరిట ఐదు చీటీలు రాసి వేస్తారు. ఇలా పది చీటీలను మరో డబ్బాలో వేసి కలిపిన తర్వా త లాటరీ తీసి ఫలితాన్ని ప్రకటిస్తారు.

వార్డులు, టేబుళ్లు, సిబ్బంది

జగిత్యాల మున్సిపాలిటీలో 48వార్డులకు 96 టేబుళ్లను వేసి, 116మంది సిబ్బందిని నియమించారు. కోరుట్ల మున్సిపాలిటీలో 30వార్డులకు 60టేబుళ్లు వేసి 72మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. మెట్‌పల్లి మున్సిపాలిటీలో 25వార్డులకు 50టేబుళ్లు వేసి 60మంది సిబ్బందిని నియమించారు. రాయికల్‌ మున్సిపాలిటీలో 12వార్డులకు 24టేబుళ్లు వేసి 30మంది సిబ్బందిని, ధర్మపురిలో 15వార్డులకు 30టేబుళ్లు వేసి 36మంది సిబ్బందిని నియమించారు.

సజావుగా జరగాలి : కలెక్టర్‌ శరత్‌

జగిత్యాల, నమస్తే తెలంగాణ : ఐదు బల్దియా ఓట్ల కౌంటింగ్‌ ఒకేచోట ఉన్నందున  ఎలాంటి ఇ బ్బందీ లేకుండా సాఫీగా జరిగేలా చూడాలని కలెక్టర్‌ శరత్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు కలెక్ట ర్‌ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్షించారు. ప్రతి మున్సిపాలిటీకి ఒక ప్ర త్యేకాధికారి చొప్పున నియమితులైన వారి ఆధ్వర్యంలోనే ఎన్నికల ప్రక్రియతో పాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కూడా నిర్వహిస్తామని, అధికారులంతా ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం పని చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ బేతి రాజేశం, మెట్‌పల్లి సబ్‌ కలెక్టర్‌ గౌతమ్‌ పొ త్రు, జడ్పీ సీఈవో శ్రీనివాస్‌, ఆర్డీవో నరేందర్‌, క మిషనర్లు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

ఉదయం నుంచి సాయంత్రం 6వరకు 144 సెక్షన్‌ : ఎస్పీ సింధూశర్మ

జగిత్యాల క్రైం : ఓట్ల లెక్కింపు నిర్వహించే వీఆర్‌కే కళాశాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని,  నేడు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు 144 సెక్షన్‌ అమలు చే స్తున్నామని ఎస్పీ సింధూశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మూడంచెల భద్ర త కల్పిస్తున్నట్లు తెలిపారు. కళాశాల పరిసర ప్రాం తాలను డాగ్‌ స్కాడ్‌, బాంబు డిస్పోజల్‌ స్కాడ్‌ తో తనిఖీలు నిర్వహిస్తామన్నారు.  అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు, అధికారులు నిషేధిత వస్తువులైన అగ్గిపెట్టె, లైటర్‌, ఇంక్‌ బాటిల్స్‌, పేలుడు పదార్థాల వంటివి తీసుకురావద్దన్నారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. ఎలక్షన్‌ అధికారులు జారీ చేసి న గుర్తింపు కార్డులు ఉన్న వారినే అనుమతిస్తామ ని తెలిపారు. 144 సెక్షన్‌ అమలు చేస్తున్నందున ఎలాంటి సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నేడు మద్యం దుకాణాల బంద్‌

జగిత్యాల, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌, ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ శాఖ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు దృష్ట్యా, జిల్లా కేంద్రంతో పాటు లెక్కింపు కేంద్రం పరిధిలోని మద్యం దుకాణాలు బంద్‌ పాటించాలని ఎక్సైజ్‌ ఎస్పీ శ్రీధర్‌ తెలిపారు. జగిత్యాల మున్సిపాలిటీ చుట్టూ ఉన్న రా మన్నపేట, నూకపెల్లిలో గల మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు 25న ఉనదయం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మూసి వేయాలని ఆదేశించారు. ఓట్ల లె క్కింపు వీఆర్‌కే ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తారని, జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో 13 మ ద్యం దుకాణాలు, 9 బార్లు, 17 కల్లు దుకాణాలు, రామన్నపేటలో 1 మద్యం దుకాణం, నూకపెల్లి గ్రామం పరిధిలో 1 కల్లు దుకాణం బంద్‌ ఉంటాయన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.logo