గురువారం 09 ఏప్రిల్ 2020
Jagityal - Jan 25, 2020 , 01:00:08

క్యాంపునకు చలోచలో..

క్యాంపునకు చలోచలో..
  • -బస్సుల్లో బయలుదేరిన కోరుట్ల, మెట్‌పల్లి టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అభ్యర్థులు
  • -ఇతరుల ప్రలోభాలకు లోనుకాకుండా ముందస్తు చర్యలు
  • -కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సమీక్షా సమావేశం
  • -పార్టీ ఆదేశాలు శిరసా వహించాలని ఆదేశం

మెట్‌పల్లి,నమస్తే తెలంగాణ/కోరుట్లటౌన్‌:  మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడి కానున్న నేపథ్యం లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు క్యాంపునకు తరలివెళ్లారు. మెట్‌పల్లి, కోరుట్ల నుంచి వేర్వేరుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో శుక్రవారం బయలుదేరారు. ఎన్నికల ఫలితాలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉన్నందున గెలిచిన అభ్యర్థులు మరే ఇతరుల ప్రలోభాలకు లోను కాకుండా అందురూ ఒకే తాటిపై ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా  క్యాంపునకు తరలివెళ్లినట్లు తెలుస్తున్నది. 

ఎమ్మెల్యే సమీక్షా సమావేశం

కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు క్యాంపు ఆఫీస్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని, పార్టీ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ శిరసావహించాలని సూచించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయబావుటా ఎగరువేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో  టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత అనూప్‌రావు, పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌ తదితరులున్నారు.logo