బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Jan 25, 2020 , 00:59:23

రిహార్సల్స్‌ అదుర్స్‌

రిహార్సల్స్‌ అదుర్స్‌
  • -ఖిల్లాలో ‘గణతంత్ర పరేడ్‌' కసరత్తు
  • -ఏఆర్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసుల సన్నద్ధం


జగిత్యాల క్రైం : దేశ 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం జగిత్యాల ఖిలాలో పోలీసులు రి హార్సల్‌ పరేడ్‌ను జిల్లా అడిషనల్‌ ఎస్పీ దక్షిణామూర్తి శుక్రవారం సాయంత్రం పర్యవేక్షించారు.  జగిత్యాల జిల్లాగా ఆవిర్భవించినప్పటి నుంచి స్వా తంత్య్ర, గణతంత్ర, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను జగిత్యాల ఖిల్లాలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 71వ గణతంత్ర వేడుకల సంద ర్భంగా జగిత్యాల ఏఆర్‌, సివిల్‌, డిస్ట్రిక్ట్‌ గార్డ్స్‌, హోం గార్డు ప్లాటూన్స్‌ రిహార్సల్‌ పరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా  ఏఎస్పీ దక్షిణామూర్తి పో లీసు కవాతును పర్యవేక్షించారు. గణతంత్ర వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాకులు విద్యార్థులు, పుర ప్రజలు భారీగా హాజరుకానున్న నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాల ని ఏఎస్పీ దక్షిణామూర్తి పోలీస్‌ అధికారులకు సూ చించారు. ఏఆర్‌ డీఎస్పీ చెల్లా ప్రతా ప్‌, ఏఆర్‌లు వామనమూర్తి, నవీన్‌, ఎస్‌ఐలు కిరణ్‌, సైదులు, సతీశ్‌,  ఏఆర్‌, సివిల్‌, డిస్ట్రిక్ట్‌ గార్డ్స్‌, హోంగార్డు ప్లాటూన్స్‌ పాల్గొన్నారు.logo